Begin typing your search above and press return to search.

క‌న్ప్యూజ‌న్ లో అనీల్? అందుకే అలా!

జ‌క్క‌న్న త‌ర్వాత వ‌రుస‌గా విజ‌యాలు ఇచ్చిన ద‌ర్శ‌కుడంటూ అనీల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:30 PM GMT
క‌న్ప్యూజ‌న్ లో అనీల్? అందుకే అలా!
X

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. 'భ‌గ‌వంత్ కేస‌రి'తో మ‌రో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వ‌రుస‌గా నాల్గ‌వ విజ‌యం అనీల్ ఖాతాలో న‌మోదైంది. దీంతో యంగ్ డైరెక్ట‌ర్ ని అంతా గ్రేట్ మేక‌ర్ రాజ‌మౌళితోనే పోల్చుతున్నారు. జ‌క్క‌న్న త‌ర్వాత వ‌రుస‌గా విజ‌యాలు ఇచ్చిన ద‌ర్శ‌కుడంటూ అనీల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

'భ‌గ‌వంత్ కేస‌రి' విజ‌యం అనీల్ కొత్త ఐడెంటిటీని తీసుకొచ్చింది. అత‌ను గొప్ప వినోదాత్మ‌క‌మైన సినిమాలే కాదు...సెంటిమెంట్ మేళ‌వించి ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌గ‌ల సినిమాలు చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. దీంతో అనీల్ త‌దుప‌రి ఎలాంటి జోన‌ర్ తో వ‌స్తాడు? అన్న ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో అనీల్ సైతం క న్ ప్యూజ‌న్ లో ప‌డ్డ‌ట్లు వినిపిస్తోంది.

వాట్ నెక్స్ట్ అన్న విష‌యంలో అనీల్ కూడా క్లారిటీగా లేన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. బాలీవుడ్ లో 'ఎఫ్ -2' చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. అయితే తాజాగా అనీల్ క్రేజ్ నేప‌త్యంలో ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నాడుట‌. తెలుగు సినిమా పాన్ ఇండియా లో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఇంత‌కు మంచి స‌రైన స‌మ‌యం ఉండ‌ద‌ని అనీల్ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది.

అలాగే ఓ స్టార్ హీరోకి అనీల్ క‌థ చెప్పి రెడీగా ఉన్నాడ‌ని అంటున్నారు. ఆ హీరో కూడా అనీల్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఓ లేడి ఓరియేంటెడ్ సినిమా చేయాల‌ని అనీల్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు. అందుకు కూడా ఇదే స‌రైన స‌మ‌యమ‌ని భావిస్తున్నాడు. ఇలా అనీల్ మైండ్ లో ఇప్పుడు మూడు ర‌కాల ఆలోచ‌న‌లు గిర్రున తిరుగుతున్నాయి.

వాటిలో దేనిని ఫైన‌ల్ చేయాలో అర్ధం కాక క‌న్య్పూజ‌న్ కి గుర‌వుతున్న‌ట్లు వినిపిస్తుంది. పైగా ఇప్పుడు అనీల్ పై ఒత్తిడి...బాధ్య‌త రెండు పెరుగుతాయి. అనీల్ నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుంద‌ని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అత‌ను బ్రాండ్ జ‌నాల్లో బ‌లంగా ఉండ‌టంతోనే ఇన్ని ర‌కాల డైల‌మాలు క‌నిపిస్తున్నాయి.