స్పీడు పెంచేస్తున్న శర్వా ప్రొడ్యూసర్!
వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో రేసులో వెనకబడటమే కాకుండా భారీ స్థాయిలో నష్టాలని ఎదుర్కొన్న పేరున్న ప్రొడ్యూసర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.
By: Ravindar Gorantla | 6 April 2026 7:20 PM ISTవరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో రేసులో వెనకబడటమే కాకుండా భారీ స్థాయిలో నష్టాలని ఎదుర్కొన్న పేరున్న ప్రొడ్యూసర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో నిర్మాత అనిల్ సుంకర ఒకరు. మహా సముద్రం, ఏజెంట్, భోళా శంకర్ వంటి భారీ డిజాస్టర్లతో చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో `నారీ నారీ నడుమ మురారి` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి ఆకట్టుకుంది.
ఈ మూవీ సక్సెస్ జోష్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన ప్రొడ్యూసర్ అని సుంకర బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒ్ఏసారి ఐదు సినిమాలని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్టుగా తెలిసింది. సాయి దుర్గతేజ్‌తో ఓ భారీ సినిమా, మంచు మనోజ్‌తో క్రేజీ మూవీ, సందీప్ కిషన్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా కొత్త వాళ్లతో రెండు ప్రాజెక్ట్‌లని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉందు సాయి దుర్గతేజ్‌తో ఓ భారీ సినిమాని స్టార్ట్ చేస్తారట.
ఆ తరువాత మంచు మనోజ్, సందీప్ కిషన్‌లతో ఒక్కో సినిమాని పట్టాలెక్కిస్తారట. ప్రస్తుతం సాయి దుర్గతేజ్ `సంబరాల ఏటి గట్టు` మూవీ చేస్తున్నాడు. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఇది విడుదల కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సాయి దుర్గతేజ్ క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటుందని ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు స్పష్టం చేశాయి. దీనితో పాటు `క` డైరెక్టర్స్ సుజీత్, సందీప్‌ల డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాని చేయబోతున్నాడు.
దీన్ని ఇటీవలే సాయి దుర్గతేజ్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. ఇక మంచు మనోజ్..చాలా రోజులు తరువాత భైరవం, మిరాయ్ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసిన మనోజ్ `డేవిడ్ రెడ్డి`లో నటిస్తున్నాడు. పీరియాడిక్ ఫిక్షన్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. బ్రిటీష్ కలోనియల్ ఎరా 1897 - 1920 నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
సందీప్ కిషన్ ప్రస్తుతం దళపతి విజయ్ సన్ జాసన్ విజయ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న `సిగ్మా`తో పాటు స్వరూప్ ఆర్ ఎస్ జె డైరెక్షన్‌లో రూపొందుతున్న `వైబ్` సినిమాల్లో నటిస్తున్నాడు. వీరి కమిట్‌మెంట్‌లు ఇలా ఉన్నాయి. ఇంత బిజీలోనూ వీరితో ఒక్కో సినిమాకు అనిల్ సుంకర ప్లాన్ చేస్తుండటం గమనార్హం. బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు చేయడం మంచిదే కానీ మళ్లీ ట్రాక్ తప్పి సినిమాలు చేస్తేనే ఇబ్బంది అని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
