Begin typing your search above and press return to search.

నా హీరోలే న‌న్ను ఆదుకున్నారు.. ప్ర‌ముఖ నిర్మాత‌

అయితే త‌న‌ను త‌న హీరోలే క‌ష్టంలో ఆదుకున్నార‌ని నిర్మాత అనీల్ సుంక‌ర తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   24 Aug 2025 8:15 AM IST
నా హీరోలే న‌న్ను ఆదుకున్నారు.. ప్ర‌ముఖ నిర్మాత‌
X

2023లో కేవ‌లం నాలుగు నెల‌ల గ్యాప్‌లో రెండు డిజాస్ట‌ర్ సినిమాలతో భారీ న‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు నిర్మాత అనీల్ సుంక‌ర‌. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `భోళా శంక‌ర్` డిజాస్ట‌ర్ కాగా, అదే ఏడాది నెల‌ల గ్యాప్ లో విడుద‌లైన‌ అఖిల్ `ఏజెంట్` కూడా డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఏజెంట్ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏడాదిలోనే రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు నిర్మాత‌ను ఆర్థిక‌ క్రైసిస్ లోకి నెట్టాయి. ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాలు త‌గ్గించారు.

అయితే త‌న‌ను త‌న హీరోలే క‌ష్టంలో ఆదుకున్నార‌ని నిర్మాత అనీల్ సుంక‌ర తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. `భోళాశంక‌ర్` తో న‌ష్ట‌పోయిన‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నార‌ని అనీల్ సుంక‌ర తెలిపారు. అలాగే ఏజెంట్ కోసం అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేద‌ని వెల్ల‌డించారు. త‌న‌కు త‌న హీరోలు స‌హ‌క‌రించార‌ని తెలిపారు.

టాలీవుడ్‌లో వ‌రుస‌గా మెగా బడ్జెట్ సినిమాల‌ను నిర్మించిన అనీల్ సుంక‌ర బిందాస్, దూకుడు, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించారు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో అనీల్ సుంక‌ర ఇప్పటికి పాతిక పైగా సినిమాలు నిర్మించారు. 2023లో భోళాశంక‌ర్, ఏజెంట్ త‌ర్వాత 2024లో `మ‌జాకా` అనే చిన్న సినిమాను నిర్మించారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సందీప్ కిష‌న్ , రీతు వ‌ర్మ‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు న‌టించారు.