Begin typing your search above and press return to search.

అనిల్ అప్పుడే మొద‌లెట్టేశాడుగా!

త‌న సినిమాను మారుమూలన ఉన్న ఆడియ‌న్స్ వ‌ద్ద‌కు కూడా ఎలా తీసుకెళ్లాల‌ని ఆలోచించే అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2025 8:00 PM IST
అనిల్ అప్పుడే మొద‌లెట్టేశాడుగా!
X

సినిమా ప్ర‌మోష‌న్లందు అనిల్ రావిపూడి ప్ర‌మోష‌న్లు వేర‌యా అన్న‌ట్టుంది ఇప్పుడు టాలీవుడ్ ప్రమోష‌న్స్ ప‌రిస్థితి. ప‌టాస్ సినిమాతో డైరెక్ట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారు. కెరీర్లో అప‌జ‌య‌మెరుగ‌ని టాలీవుడ్ డైరెక్ట‌ర్ గా పేరందుకున్న అనిల్ తాను తీసే సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు.

త‌న సినిమాను మారుమూలన ఉన్న ఆడియ‌న్స్ వ‌ద్ద‌కు కూడా ఎలా తీసుకెళ్లాల‌ని ఆలోచించే అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ సినిమాలకూ షూటింగ్ పూర్త‌య్యాక ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తే ఈ సినిమాకు అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టి చిరంజీవిని కూడా అందులో భాగం చేశారు అనిల్ రావిపూడి.

అక్క‌డితో అయిపోలేదు. ఆ త‌ర్వాత మెగా157 కోసం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారను ఎంపిక చేయ‌డ‌మే కాకుండా న‌య‌న్ కెరీర్లో ఎప్పుడూ లేనిది ఆమెతో ప్ర‌మోష‌న‌ల్ వీడియో కూడా చేయించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు అనిల్. ప్ర‌తీ సినిమాకూ కొత్త క‌థ రాసుకున్న‌ట్టు, అనిల్ ప్ర‌తీ సినిమాకూ కొత్త క‌థ‌తో పాటూ కొత్త ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీని కూడా ఫాలో అవుతూ ఉంటార‌నేలా అనిల్ త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు.

అలా ప్లాన్ చేసుకున్న ప్ర‌మోష‌న్లతోనే అనిల్ సగం మంది ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న మెగా157 కు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజింగ్ ప్ర‌మోష‌న‌ల్ వీడియో బ‌య‌టికొచ్చింది. ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో జ‌రిగే ప్రోగ్రామ్ కు అనిల్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఆ కార్య‌క్ర‌మంలో మెగా157 కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో చూడగానే బుల్లితెర ఆడియ‌న్స్ అంతా ఒక్క‌సారిగా షాక‌వ‌గా, నెటిజ‌న్లు ఆ ప్రోమోను వైర‌ల్ చేస్తూ అనిల్ మెగా157ను ఇలా కూడా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మెగా157 వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.