Begin typing your search above and press return to search.

రావిపూడి పొదుపు మంత్రం... మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్‌

ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 April 2025 6:00 PM IST
రావిపూడి పొదుపు మంత్రం... మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్‌
X

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో 2025 సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరహాలోనే పూర్తి స్థాయి ఎంటర్‌టైన్మెంట్‌తో మెగాస్టార్‌ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నుంచి ఈ మధ్య కాలంలో చూడని వినోదాన్ని అనిల్‌ రావిపూడి మెగా ఫ్యాన్స్‌కి అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వెంకటేష్ ఈ సినిమాలో కీలకమైన గెస్ట్‌ రోల్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్‌ షూటింగ్‌కి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

అనిల్ రావిపూడి సినిమా మేకింగ్‌ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ సమయంలోనే 95 శాతం వరకు సన్నివేశాలు ఎలా ఉండాలి అనేది ఫైనల్‌ చేస్తాడట. తద్వారా సినిమాలోని సన్నివేశాలకు రెండు మూడు వర్షన్‌లు తీసే అవసరం రాదు. అనిల్‌ రావిపూడి మేకింగ్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా కొందరు దర్శకులు మూడు గంటల సినిమాకు 5 గంటల ఫుటేజ్ ఎడిటర్‌కి ఇస్తారట. కానీ అనిల్ రావిపూడి మాత్రం అయిదు నుంచి పది నిమిషాలు, మహా అయితే పావుగంట ఎక్కువ నిడివి మాత్రమే ఇస్తాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కొన్ని నిమిషాలు కూడా అదనంగా షూట్‌ చేయలేదని చెప్పుకొచ్చారు.

నిర్మాతకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, రూపాయి కూడా వృదా కాకుండా దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తాడు. సెట్స్ నిర్మాణం, లొకేషన్స్ ఎంపిక ఇలా ప్రతీది తాను దగ్గర ఉండి చూసుకుంటాడు. తద్వారా బడ్జెట్‌ అదుపులో ఉంటుంది. కెరీర్ ఆరంభం అయి ఇన్నాళ్లు అయినా అనిల్‌ రావిపూడి ఎప్పుడూ కూడా తాను ముందుగా అనుకున్న బడ్జెట్‌ కంటే మించి పోలేదు. దాంతో నిర్మాత ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాడు. దిల్‌ రాజు ఇప్పటి వరకు అనిల్ రావిపూడితో తీసిన ప్రతి సినిమాకు లాభాలను దక్కించుకోవడంకు కారణం బడ్జెట్‌ నియంత్రణ అనే అభిప్రాయం ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి సినిమా బడ్జెట్‌ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

చిరంజీవి, అనిల్ రావిపూడి పారితోషికాలు భారీగా ఉంటాయి. మిగిలిన అందరి పారితోషికాలు నామమాత్రంగా ఉండటంతో పాటు, మేకింగ్‌ సైతం చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటే భారీ బడ్జెట్‌ను అభిమానులు ఆశిస్తారు. భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్ ఉంటేనే బాగుంటుందని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అంతా అనిల్ రావిపూడి పొదుపు మంత్రంకు కాస్త టెన్షన్ పడుతున్నారు. బడ్జెట్‌ ఎంత ఉంటే ఏంటి.. సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటే చాలు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. 2026 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సమ్మర్ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.