157 కోసం కొత్త భామ కోసం సెర్చింగ్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 28 April 2025 6:49 AMమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. టెక్నికల్ గా అనీల్ పాత టీమ్ నే కొనసాగిస్తున్నాడు. నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇంత వరకూ చిరుకు జోడీగా నయన్ నటించలేదు. 'గాడ్ ఫాదర్' లో సోదరి పాత్రకు పరిమితం అవ్వడంతో? అది కాంబినేషన్ కాలేకపోయింది.
ఈ నేపథ్యంలో అనీల్ చిరు-నయన్ ను ఒకే ప్రేమ్ లో చూడాలని ఆశించారు. ఈనేపథ్యంలో నయనతారను అప్రోచ్ అవ్వగా పారితోషికం దిమ్మతిరిగే రేంజ్ లో షాక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు నయనతార అనే ఆప్షన్ ను మైండ్ లో నుంచి డిలీట్ చేసారట. ఆమెకు 18 కోట్లు ఇచ్చి తీసుకురావడం కన్నా మరో భామను ఎంపిక చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొత్త భామ కోసం సెర్చింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. అలాగని చిరంజీవికి హీరోయిన్ సెట్ అవ్వడం అంత సులభం కాదు. ఆయన స్టార్ డమ్ కి తగ్గ భామను తీసుకురావాలి. కాజల్, త్రిష ఇప్పటికే చాలా సినిమాలు చేసారు. తమన్నా కూడా నటించింది. దీంతో చిరు వయసును మ్యాచ్ చేస్తూ క్రేజీ భామను వెతికి పట్టుకోవాలి. మరి ఈ ఛాన్స్ సౌత్ నుంచి తీసుకుంటారా? నార్త్ కి వెళ్తారా? అన్నది చూడాలి.
ఈ మధ్య కాలంలో నార్త్ భామలకంటే సౌత్ భామలే మంచి స్వింగ్ లో ఉన్నారు. నేచురల్ పెర్పార్మెన్స్ తో అలరిస్తున్నారు. ఈ సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్ లోనే కథ సాగుతుంది. దీంతో కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ తీసుకోవడం కలిసొస్తుందన్నది అనీల్ రైటర్ల బృందం మరో ఆప్షన్ గా సూచించినట్లు సమాచారం.