నాగార్జునను లాగేస్తే ఓ పనైపోతుంది!
ఇప్పటికే 'భగవంత్ కేసరి'తో బాల య్యకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ కు 'సంక్రాంతికి వస్తున్నాం'తో గొప్ప విజయాన్ని అందించాడు. వెంకీని ఏకంగా 300 కోట్ల క్లబ్ లోనే కూర్చోబెట్టాడు. ఇప్పటి వరకూ చిరంజీవి సైతం చూడని సక్సెస్ అది.
By: Tupaki Desk | 24 May 2025 12:06 PM ISTఅనీల్ రావిపూడికి ఇప్పటివరకూ వైఫల్యమే లేదు. చేసిన సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అందులోనూ సీనియర్ హీరోలకు హిట్లు ఇవ్వడంలో మాస్టర్ అయిపోయాడు. ఇప్పటికే 'భగవంత్ కేసరి'తో బాల య్యకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ కు 'సంక్రాంతికి వస్తున్నాం'తో గొప్ప విజయాన్ని అందించాడు. వెంకీని ఏకంగా 300 కోట్ల క్లబ్ లోనే కూర్చోబెట్టాడు. ఇప్పటి వరకూ చిరంజీవి సైతం చూడని సక్సెస్ అది.
157 తో అది ప్రూవ్ అవుతుందని అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి 157వ సినిమాని అనీల్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అనీల్ మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. సంక్రాంతిని మించిన బ్లాక్ బస్టర్ ఇస్తాడని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు బలంగా ఉన్నాయి. ఇలా వెంకీ, చిరు, బాల య్యలను కవర్ చేసారు. ఇక మిగిలిన సీనియర్ ఎవరంటే కింగ్ నాగార్జున ఒక్కరే.
చిరంజీవి తర్వాత కింగ్ తోనే సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని అనీల్ కూడా కన్పమ్ చేసాడు. ముగ్గురు సీనియర్ హీరోలతోనూ పనిచేసాను. నాగార్జున గారిని కూడా లాగేస్తే ఓపనైపోతుంది కదా? అని ప్రకటించాడు. దీంతో నాగ్ - అనీల్ కాంబినేషన్ కూడా సెట్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది. మొత్తం నలుగురు సీనియర్లను కవర్ చేసిన దర్శకుడిగా అనీల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ సీనియర్లను డైరెక్ట్ చేసింది ఎవరంటే? బోయపాటి శ్రీను పేరు వినిపిస్తుంది. వెంకీ తో, బాలయ్యతో పనిచేసారు. నాగార్జునతో, చిరంజీవితో మాత్రం పనిచేయలేదు. చిరంజీవికి కూడా బోయపాటికి అవకాశం ఇచ్చారు. కానీ బోయపాటి కంటే? ముందే నలుగుర్ని కవర్ చేసిన అరుదైన ఘనత అనీల్ కే సాధ్యమవుతుంది.
