మెగా157 లో స్పెషల్ సాంగ్
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
By: Tupaki Desk | 2 Jun 2025 12:04 PM ISTటాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత పలు సినిమాలు చేసి ఒకదాన్ని మించి మరొకటి హిట్లు అందుకున్నాడు. ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత అనిల్ తన తర్వాతి సినిమా కోసం ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లి ఎంతో వేగంగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇంకా చెప్పాలంటే అనిల్ ప్లానింగ్ వల్ల అనుకున్న దాని కంటే ఒకరోజు ముందుగానే ఈ షెడ్యూల్ పూర్తైందట.
మెగాస్టార్ తో అనిల్ సినిమా అనే అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలను పెంచుకుని విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కూడా జాయిన్ అవడంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. దానికి తోడు తన కెరీర్లో ఇప్పటివరకూ ఏ సినిమానీ ప్రమోట్ చేయని నయన్ ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా చేస్తుండటంతో ఈ సినిమా అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మెగా157 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాటలు తక్కువే ఉన్నాయని ముందు నుంచి అంటున్నారు. సినిమాలో తక్కువ సాంగ్స్ ఉన్నప్పటికీ అందులో ఒక సూపర్బ్ సాంగ్ ను చిరంజీవి, నయనతారపై అనిల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవి స్టెప్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని కూడా అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తన మ్యూజిక్ తో ప్రాణం పోసి సినిమా సక్సెస్ లో ఎంతో కీలకంగా నిలిచిన భీమ్స్ ఇప్పుడు మెగా157 కోసం దాన్ని మించిన ఆల్బమ్ ను రెడీ చేస్తున్నాడని టాక్.
