అనీల్ దూకుడిని ఇప్పట్లో ఆపలేం!
యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి సక్సెస్ కి ఇంతవరకూ బ్రేక్ పడలేదు. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం 'అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే.
By: Tupaki Desk | 24 May 2025 10:30 AMయంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి సక్సెస్ కి ఇంతవరకూ బ్రేక్ పడలేదు. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం 'అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే. సంక్రాంతి విజయంతో బాక్సాఫీస్ నే షేక్ చేసాడు. అతడి కెరీర్ లో ఇదే భారీ వసూళ్ల చిత్రం. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిరంజీవితో పట్టాలెక్కించిన 157వ చిత్రం బాక్సాఫీస్ బరిలో 500 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగుతుంది.
ఆ రేంజ్ ని టచ్ చేస్తుందని అంచనాలు బలంగా ఉన్నాయి. ఇంతవరకూ అనీల్ పై నెగిటివిటీ కూడా లేదు. మరి అనీల్ సక్సెస్ స్పీడ్ కి బ్రేక్ పడేది ఎప్పుడు? అంటే ఇప్పట్లో సాద్యం కాదంటున్నాడు అనీల్. అందుకు ఇంకా ఇంకాస్త సమయం పడుతుందని తన సక్సస్ పై ధీమా వ్యక్తం చేసాడు. కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ మాత్రం తప్పనిసరి అంటున్నాడు. ఎల్లకాలం ఒకేలా ఉండదని..ఒక్కొక్కరిది ఒక్కో టైమ్ నడుస్తుంది.
అలా సాగినంత కాలం బాగానే ఉంటుంది. సక్సస్ కి బ్రేక్ పడితే మాత్రం పుంజుకోవడానికి సమయం పడు తుంది. ఒక్కోసారి ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారు. గత సక్సెస్ లు చూసి అవకాశాలు అందు కుంటున్నారు. అయితే ఈ అవకాశాలు కూడా ఎంతో కాలం రావు. హిట్ పడితేనే కొత్త ఛాన్సులకు దారుంటుంది.
లేదంటే అవకాశాలు మరింత జఠిలమవుతాయి. అటుపై ఇండస్ట్రీలో కొనసాగడమే ప్రశ్నార్ధకంగా మారు తుంది. వి. వినాయక్ సక్సెస్ లు ఇచ్చినంత కాలం ఇచ్చారు. ఆ తర్వాత వైఫల్యాలతో దర్శకుడిగా దూర మైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఇదో ప్రోసస్. ఇక్కడ ఎవరూ అతీతులు కారు. ఫాంలో ఉన్నంత కాలం తిరుగుండదు. అది కోల్పోతేనే పాత పునాదిపై మళ్లీ గోడలు కడదామన్నా? బలహీనంగా మారతాయి.