Begin typing your search above and press return to search.

కెరీర్లో హై ఇచ్చిన స‌క్సెస్ అదొక్క‌టే

టాలీవుడ్ లో 100% స‌క్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న డైరెక్ట‌ర్లలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అనిల్ రావిపూడినే ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 3:53 PM IST
కెరీర్లో హై ఇచ్చిన స‌క్సెస్ అదొక్క‌టే
X

టాలీవుడ్ లో 100% స‌క్సెస్ రేట్ తో దూసుకెళ్తున్న డైరెక్ట‌ర్లలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అనిల్ రావిపూడినే ఉన్నారు. అనిల్ కెరీర్ మొదలు పెట్టిన ప‌టాస్ మూవీ నుంచి రీసెంట్ గా వ‌చ్చిన మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు వ‌ర‌కూ అన్నీ సూప‌ర్ హిట్లే. అందుకే అనిల్ సినిమా మొద‌లు పెడుతున్నారంటే ఆ మూవీ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఇండ‌స్ట్రీలోనే కాదు, ఆడియ‌న్స్ కు కూడా క‌లుగుతుంది.

ప‌టాస్ తో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ

రైట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్, 2015లో ప‌టాస్ మూవీతో డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు అనిల్ నుంచి 9 సినిమాలు రాగా, అందులో ఒక్క ఫ్లాప్ కూడా అత‌ని ఖాతాలో లేదు. వ‌రుస స‌క్సెస్‌ల‌తో అనిల్ గ‌త 11 ఏళ్లగా కెరీర్ లో దూసుకెళ్తూ, క‌మర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ల‌కు కేరాఫ్ గా మారారు. అయితే ఈ తొమ్మిది స‌క్సెస్‌ల‌లో ఏ మూవీ స‌క్సెస్ త‌న‌కు ఎక్కువ హై ఇచ్చిందో అనిల్ రీసెంట్ గా తెలిపారు.

అనిల్ టీమ్ లో రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన సాయి కృష్ణ ఇప్పుడు డైరెక్ట‌ర్ గా మారి హై అనే సినిమాను తెరకెక్కించ‌గా, ఆ మూవీ టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ కు అనిల్ హాజ‌రయ్యారు. స‌క్సెస్ అనేది ఎవ‌రికైనా హై ఇస్తుంది. వ‌రుస‌గా 9 బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌చ్చాయి, అందులో ఎక్కువ హై ఇచ్చిన మూవీ ఏంట‌ని అడ‌గ్గా, దానికి అనిల్ చెప్పిన స‌మాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప‌టాస్ స‌క్సెస్ ఇచ్చిన ఫీలింగ్ నెక్ట్స్ లెవెల్

త‌న తొమ్మిది సినిమాల్లో త‌న‌కు ఎక్కువ‌గా హై ఇచ్చిన స‌క్సెస్ ప‌టాస్ మూవీనే అని, డైరెక్ట‌ర్ గా త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసిన సినిమా కావ‌డంతో, ఆ స‌క్సెస్ ఇచ్చిన ఫీలింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంద‌న్నారు. ప‌టాస్ త‌ర్వాత నుంచి త‌ర్వాత ఎవ‌రితో సినిమా చేయాలి? ఎలాంటి క‌థ‌తో ఆడియ‌న్స్ ముందుకు రావాల‌నే టెన్ష‌న్, సినిమా రిలీజ్ ముందుకు భ‌యం ఉంటున్నాయ‌న్నారు.

ప‌టాస్ త‌ర్వాత ప్ర‌తీ సినిమాకీ భ‌య‌ప‌డ‌ట‌మే

అందుకే మొద‌టి సినిమాకు వ‌చ్చిన హై ఆ త‌ర్వాత ఏ మూవీకీ రాలేద‌ని, ప్ర‌తీ సినిమాకీ ముందు రోజూ భ‌యంతో వ‌ణికిపోతూనే ఉంటాన‌ని, సినిమా పెద్ద హిట్ అయిఏత బావుంటుంద‌నే ఆశ త‌ప్ప‌, హై ఫీలింగ్ మాత్రం ఉండ‌ద‌ని, రిలీజ‌య్యాక హ‌మ్మయ్యా బ‌య‌ట‌ప‌డిపోయా అనుకుంటాన‌ని, ప‌టాస్ త‌ర్వాత ప్ర‌తీ సినిమానూ దిన దిన గండంగానే చేస్తున్నాన‌ని అనిల్ చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.

ఇక ప‌టాస్ మూవీ విష‌యానికొస్తే క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన ప‌టాస్ మూవీ ఆ టైమ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ హిట్ గా నిలిచింది. కామెడీతో పాటూ పోలీస్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఆ మూవీ క‌ళ్యాణ్ రామ్ కెరీర్ కు కూడా టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు. మొత్తానికి అనిల్ కెరీర్ ను మార్చిన ప‌టాస్ త‌న‌కెప్ప‌టికీ స్పెష‌లేన‌ని అనిల్ మ‌రోసారి ప్రూవ్ చేశారు.