Begin typing your search above and press return to search.

నా వ‌ల్లే ఆ మూవీ లేటైంది

టాలీవుడ్ హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి వద్ద ప‌లు సినిమాల‌కు అసోసియేట్ గా, కో రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన సాయి కృష్ణ ఇప్పుడు హీరోగా, డైరెక్ట‌ర్ గా మారుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 4:23 PM IST
నా వ‌ల్లే ఆ మూవీ లేటైంది
X

టాలీవుడ్ హిట్ మిష‌న్ అనిల్ రావిపూడి వద్ద ప‌లు సినిమాల‌కు అసోసియేట్ గా, కో రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన సాయి కృష్ణ ఇప్పుడు హీరోగా, డైరెక్ట‌ర్ గా మారుతున్నారు. సాయి కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో హై అనే సినిమా తెర‌కెక్కుతుంది. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌గా, ఆ ఈవెంట్ కు అనిల్ రావిపూడి గెస్టుగా హాజ‌ర‌య్యారు.

డైరెక్ట‌ర్ గా మారిన అనిల్ శిష్యుడు

త‌న శిష్యుడి టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ కు రావ‌డం గురించి అనిల్ మాట్లాడుతూ, అన్నీ ఈవెంట్ల‌కు రావ‌డం వేరు, ఈ ఈవెంట్ కు రావ‌డం వేర‌ని చెప్పారు. సాయి త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని, తాను డైరెక్ట‌ర్ గా మార‌డంతో పాటూ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీ సాయితో పాటూ త‌న‌కు కూడా స్పెష‌ల్ అని, ఈ ఈవెంట్ కు రావ‌డం త‌న బాధ్య‌త‌గా చెప్పారు.

సాయిని ఎప్పటికీ వ‌దులుకోను

సాయి ఈ సినిమా చేయ‌డానికి రెండేళ్లు ప‌ట్టిందని అంద‌రూ అంటున్నారు. దానికి కార‌ణం తానేన‌ని, ఎందుకంటే సాయి అత‌ని సొంత సినిమా చేసుకోవ‌డంతో పాటూ త‌న‌ సినిమాకు త‌న‌తో కూడా క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుకుంటాన‌ని, త‌న సినిమా అంటే సాయిని వ‌దులుకోన‌ని, సిట్టింగ్స్ నుంచి షూటింగ్, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటూ అన్నీ తానే చూసుకునేవాడ‌ని అనిల్ చెప్పారు.

గ్యాప్ లో హై మూవీని చేశాడు

అవ‌న్నీ చేస్తూ, గ్యాప్ దొరికిన‌ప్పుడు హై మూవీని పూర్తి చేశాడ‌ని, ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ లేట‌వ‌డానికి కార‌ణం తానేన‌ని, ఈ సినిమా కోసం సాయి చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని, సాయి మంచి జ‌డ్జిమెంట్ ఉన్న టెక్నీషియ‌న్ అని, బ‌య‌ట త‌న‌కు తెలిసిన సాయి వేర‌ని, హై లో చూస్తున్న సాయి వేర‌ని, ఒక కొత్త జాన‌ర్ లో డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో సాయి ఈ సినిమాను తెర‌కెక్కించార‌ని, ఆ ప్ర‌య‌త్నం ఆడియ‌న్స్ కు త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని అనిల్ అన్నారు.

2టైమ్ లో గంట గొడ‌వ ప‌డ్డాం

ఇక అదే ఈవెంట్ లో అనిల్ గురించి సాయి మాట్లాడుతూ, త‌న‌కు అనిల్ కు మ‌ధ్య కూడా గొడ‌వ‌లు జ‌రుగుంటాయ‌ని, ఒక్కోసారి ఆ గొడ‌వ‌లు చాలా పెద్ద స్థాయిలో కూడా జ‌రుగుతాయ‌ని, ఎఫ్2 టైమ్ లో తాను, అనిల్ దాదాపు ఓ గంట సేపు రోడ్ మీద అరుచుకున్నామ‌ని, అంద‌రూ ఉన్నా కానీ క‌నీసం ఎవ‌రూ ఆప‌డానికి కూడా ట్రై చేయ‌లేద‌ని, ఆ గొడ‌వ చూసి ఇక వీరిద్ద‌రూ తర్వాత క‌లిసి వ‌ర్క్ చేయ‌ర‌నుకున్నార‌ని, కానీ ఆ గొడ‌వ త‌ర్వాత ఇద్ద‌రం కూల్ అయిపోతామ‌ని, తామిద్ద‌రం పాజిటివ్ గా ముందుకెళ్లాల‌నుకుంటామ‌ని, అందుకే వెంట‌నే కూల్ అవుతామ‌ని, సాయి కృష్ణ చెప్పారు.