Begin typing your search above and press return to search.

రావిపూడి యానిమేషన్ ప్రాజెక్ట్.. అసలు ప్లాన్ ఏంటంటే?

ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీకి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడు యానిమేషన్ సినిమా చేస్తే, అందులో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

By:  M Prashanth   |   7 April 2026 5:00 PM IST
రావిపూడి యానిమేషన్ ప్రాజెక్ట్.. అసలు ప్లాన్ ఏంటంటే?
X

టాలీవుడ్‌ లో తనదైన కామెడీ స్టైల్‌ తో వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈసారి యానిమేషన్ జానర్‌ లోకి అడుగుపెట్టబోతున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పౌరాణిక కథల నేపథ్యంతో ఆ ప్రాజెక్ట్ రూపొందే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి ఆ భారీ యానిమేషన్ ప్రాజెక్ట్‌ ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని, కథా చర్చలు కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రామాయణం లోని ఏదైనా ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని కథను తీర్చిదిద్దే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అందులో నిజమెంతో తెలియదు.

ఇటీవల యానిమేషన్ జానర్‌ పై పెరుగుతున్న ఆసక్తి కూడా నిర్ణయానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మహావతార్ నరసింహ వంటి ప్రాజెక్టుల విజయంతో, పౌరాణిక కథలు కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ట్రెండ్ పెరుగుతోంది. ఇదే ట్రెండ్‌ ను ఫాలో అవుతూ అనిల్ రావిపూడి కూడా ఆ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీకి పెట్టింది పేరు. అలాంటి దర్శకుడు యానిమేషన్ సినిమా చేస్తే, అందులో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన ప్రత్యేకమైన టైమింగ్, డైలాగ్ హ్యూమర్ యానిమేషన్ ఫార్మా ట్‌ లో ఎలా కనిపిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కామెడీతో పాటు విజువల్ గ్రాండియర్ ఉండేలా ఆ ప్రాజెక్ట్ రూపొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఈ సంక్రాంతికి విడుదలైన తన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విజయంతో అనిల్ రావిపూడి మంచి జోష్‌ లో ఉన్నారు. అదే ఊపుతో తదుపరి సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌ లో ఒక మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ ను లైన్‌ లో పెట్టినట్టు సమాచారం. 2027 సంక్రాంతికి విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.

ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే యానిమేషన్ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సినిమా ద్వారా నార్త్ మార్కెట్‌ పై దృష్టి పెట్టాలని అనిల్ భావిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, విజువల్స్‌ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే, కామెడీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రావిపూడి ఇప్పుడు ఫాంటసీ, యానిమేషన్ జానర్ వైపు మళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆ ప్రాజెక్ట్ నిజంగా రామాయణం నేపథ్యంతో వస్తే, తెలుగు సినిమా యానిమేషన్ రంగంలో మరో పెద్ద అడుగు పడే అవకాశముంది. ఇక ప్రాజెక్ట్‌ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.