Begin typing your search above and press return to search.

హీరోగా రావిపూడి.. క్లారిటీ ఇచ్చినట్లే!

ఈ డ్యాన్స్‌తో స్టేజ్‌పై ఫుల్ జోష్ వచ్చింది. ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్న జడ్జి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, ఆడియన్స్ అందరి మైండ్‌లో ఉన్న క్వశ్చన్‌ను డైరెక్ట్‌గా సంధించాడు.

By:  Tupaki Desk   |   9 Nov 2025 2:11 PM IST
హీరోగా రావిపూడి.. క్లారిటీ ఇచ్చినట్లే!
X

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, 'F2' సిరీస్‌తో కామెడీకి కొత్త బ్రాండ్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి, నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే గాసిప్ చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమధ్య ఒక ఈవెంట్ లో హరీష్ శంకర్ తో స్కిట్ చేయడం అప్పుడప్పుడు డ్యాన్స్ చేయడం, ఇక ప్రమోషన్స్ లో నటించడం చూస్తుంటే తప్పకుండా ఆయనకు కెమెరా ఎట్రాక్షన్ గట్టిగానే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. కొన్నేళ్ళ అనంతరం నటుడిగా కొనసాగే కోరిక ఉందని కూడా పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.

అయితే, అనిల్ ఈ మధ్య తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. సన్నబడటం, స్టైలిష్‌గా రెడీ అవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఫైనల్‌గా, ఈ టాపిక్‌పై అనిల్ రావిపూడి ఒక రియాలిటీ షో స్టేజ్ మీద దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. రీసెంట్‌గా, అనిల్ రావిపూడి 'జీ తెలుగు సరిగామప లిటిల్ చాంప్స్' షోకు స్పెషల్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. షో మొత్తం ఫుల్ ఫన్‌గా సాగింది. అయితే, ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షోలో భాగంగా, హోస్ట్ సుడిగాలి సుధీర్ అనిల్ రావిపూడిని డ్యాన్స్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ఏమాత్రం మొహమాటపడకుండా, అనిల్ వెంటనే స్టేజ్ ఎక్కాడు. తన అప్ కమింగ్ మెగా విక్టరీ మల్టీస్టారర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని చార్ట్‌బస్టర్ సాంగ్ "మీసాల పిల్ల"కు స్టెప్పులేశాడు. అక్కడే ఉన్న యాంకర్ సుధీర్ తో కలిసి ఆయన వేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

ఈ డ్యాన్స్‌తో స్టేజ్‌పై ఫుల్ జోష్ వచ్చింది. ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్న జడ్జి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, ఆడియన్స్ అందరి మైండ్‌లో ఉన్న క్వశ్చన్‌ను డైరెక్ట్‌గా సంధించాడు. " మీరు హీరోగా నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు?" అని అడిగేశాడు. ఈ సడెన్ క్వశ్చన్‌కు అనిల్ రావిపూడి వెంటనే సిగ్గుపడుతూ, పెద్దగా నవ్వేశాడు.

అసలు మ్యాటర్‌ను డైవర్ట్ చేయడానికి చూస్తూ, "అంటే.. ఇప్పుడు అప్పుడే లేదు సార్" అంటూ చాలా డిప్లమాటిక్‌గా ఆన్సర్ ఇచ్చాడు. ఇంకేముంది, యాంకర్ ఆ మాటను వెంటనే పట్టేశాడు. "ఆహా! 'ఇప్పుడు అప్పుడే లేదు' అంటే, 'తర్వాత ఉంది' అని మీరే కన్ఫర్మ్ చేసినట్టు. హీరో గారు.. హీరో గారు.." అంటూ స్టేజ్ మీద గోల మొదలుపెట్టాడు.

యాంకర్ అంటున్న మాటలకు అనిల్ రావిపూడి నవ్వుతూ ఉండిపోయాడు తప్ప, "నేను హీరోగా చెయ్యట్లేదు" అని గట్టిగా ఖండించలేదు. దీంతో యాంకర్, "మీరు 'ఉంది' అని ఒప్పుకున్నారు, అదే ఫైనల్" అంటూ ఫిక్స్ చేసేశాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన నెటిజన్లు, "అనిల్ సార్ రియాక్షన్ చూస్తే, హీరోగా సినిమా పక్కా" అని కామెంట్స్ చేస్తున్నారు. సో, అనిల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా, ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఖాయమని క్లారిటీ వచ్చేసినట్లే.