Begin typing your search above and press return to search.

40 ఏళ్ల హీరో స‌ర‌స‌న 19 ఏళ్ భామ‌!

ఇందులో ధ‌నుష్ కిజోడీగా నిత్యామీన‌న్ న‌టిస్తోంది. అయితే ఇందులో అనికా సురేంద్ర‌న్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది

By:  Tupaki Desk   |   31 Dec 2023 1:30 PM GMT
40 ఏళ్ల హీరో స‌ర‌స‌న 19 ఏళ్ భామ‌!
X

బాల న‌టిగా తెరంగేట్రం చేసిన అనికా సురేంద్ర‌న్ సుప‌రిచిత‌మే. 'విశ్వాసం'..'క్వీన్'..'ది గోస్ట్' లాంటి చిత్రాల ద్వారా బాల న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ హీరోయిన్ గా కూడా ఇటీవ‌ల ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. నేనింకా చిన్న పిల్ల‌ను అనుకుంటే మీ భ్ర‌మ ..నేను పెద్ద‌దాన్ని అయిన్నా...హీరోయిన్ వ‌య‌సు వ‌చ్చేసిందంటూ ఇన్ స్టా వేదిక‌గా బాల న‌టి షేర్ చేస్తోన్న ఫోటోల్ని భామా మాణిగా మారిపోయింద‌ని తెలిపోయింది.


'బుట్ట‌బొమ్మ' సినిమాతో అమ్మ‌డు హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చేసింది. అటుపై దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన 'కింగ్ ఆప్ కొత్త‌'లోనూ న‌టించింది. అయితే ఇప్పుడీ 19 ఏళ్ల భామ ఏకంగా 40 ఏళ్ల హీరోతో రొమాన్స్ కి రెడీ చేసిందా? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. ధ‌నుష్ క‌థానాయ‌కుడుగా ఆయ‌న 50వ చిత్రం షూటింగ్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇందులో ధ‌నుష్ కిజోడీగా నిత్యామీన‌న్ న‌టిస్తోంది. అయితే ఇందులో అనికా సురేంద్ర‌న్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆ పాత్ర లో కాస్త నెగిటివ్ ట‌చ్ ఉంటుందిట‌. ఎస్. జెసూర్య విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఆమె సోద‌రి పాత్ర‌లో న‌టిస్తుంద‌ని గుస గుస వినిపిస్తుంది. ఓ స‌న్నివేశంలో భాగంగా ధ‌నుష్ తో కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించింద‌ని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

సీన్ డిమాండ్ చేయ‌డంతోనే ధ‌నుష్ ఆ స‌న్నివేశాన్ని సినిమాలో పెట్టిన‌ట్లు వినిపిస్తుంది. సాధార‌ణంగా ధ‌నుష్ సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాల‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. క్లీన్ అండ్ నీట్ గా అత‌ని సినిమా లుంటాయి. కానీ ఈ సినిమాకి తానే ద‌ర్శ‌కుడు కావ‌డం....స‌న్నివేశం డిమాండ్ చేయ‌డంతో తానే త‌ప్ప‌క న‌టించాల్సి వ‌చ్చింద‌ని కోలీవుడ్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.