Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మరింత హాట్‌ గా స్టార్‌ హీరో రీల్‌ కూతురు

అజిత్‌ కూతురు అనగానే చాలా మందికి ఆయన సొంతం పిల్లల కంటే కూడా ముందుగా అనిఖా సురేంద్రన్‌ గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:30 PM GMT
పిక్ టాక్‌ : మరింత హాట్‌ గా స్టార్‌ హీరో రీల్‌ కూతురు
X

అజిత్‌ కూతురు అనగానే చాలా మందికి ఆయన సొంతం పిల్లల కంటే కూడా ముందుగా అనిఖా సురేంద్రన్‌ గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే అనిఖా ను అజిత్ రీల్‌ కూతురు అంటూ చాలా మంది పిలుస్తూ ఉంటారు. చిన్న వయసు లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిఖా బాల నటిగా పదుల కొద్దీ సినిమాల్లో నటించి మెప్పించింది.


అనిఖా పెద్ద అమ్మాయి అయింది. ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా హీరోయిన్‌ గా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కుతున్నాయి. సాధారణంగా బాల నటిగా అమ్మాయిలకు ఆఫర్లు తక్కువ వస్తూ ఉంటాయి. వారు ఒకే సారి అందాల ఆరబోత చేస్తే... స్కిన్‌ షో చేస్తే విమర్శలు వస్తాయి అనే అభిప్రాయం ఉంది.

అనిఖా సురేంద్రన్ విషయంలో అలా ఏం జరగలేదు. మెల్ల మెల్లగా కాకుండా అనిఖా రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి కవ్వించే చూపులతో నడుము అందాన్ని చూపిస్తూ అనిఖా షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గతంతో పోల్చితే ఈసారి మరింత అందంగా, హాట్ గా అనిఖా సురేంద్రన్‌ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ రేంజ్ లో అందాల విందు చేస్తూ దూసుకు పోతున్న అనిఖా సురేంద్రన్‌ భవిష్యత్తులో స్టార్‌ హీరోల సినిమా ల్లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న వయసు లోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్ రేంజ్‌ లో స్కిన్ షో చేస్తూ దూసుకు పోతోంది.