Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరికి రాని సమస్యలో ఆ హీరోయిన్

తాను ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నెలలుగా మ్యూజిక్ ఫీచర్‌ను వాడలేకపోతున్నానని స్వయంగా వెల్లడించారు. ఈ విషయంలో తన ఫాలోవర్స్‌కు సహాయం కోసం ఆమె రిక్వెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   26 April 2025 4:35 PM
ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరికి రాని సమస్యలో ఆ హీరోయిన్
X

ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎం మేల్ ఎన్నడి కోబం' (జాబిలమ్మ నీకు అంత కోపమా) చిత్రంలో నటించిన అనికా సురేంద్రన్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సమస్యతో వార్తల్లో నిలిచారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నెలలుగా మ్యూజిక్ ఫీచర్‌ను వాడలేకపోతున్నానని స్వయంగా వెల్లడించారు. ఈ విషయంలో తన ఫాలోవర్స్‌కు సహాయం కోసం ఆమె రిక్వెస్ట్ చేశారు.

అనికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ సమస్యను షేర్ చేసుకున్నారు. "హాయ్, నాకు ఓ చిన్న ఇబ్బంది ఎదురైంది. గత రెండు నెలలుగా నా ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూజిక్ యాక్సెస్ బ్లాక్ అయ్యింది" అంటూ తన బాధను వివరించారు. దీనిని పరిష్కరించడానికి ఆమె ఖాతాను బిజినెస్ అకౌంట్ నుంచి క్రియేటర్ అకౌంట్‌గా మార్చారు. కానీ ఇది కూడా ఫలితం ఇవ్వలేదట.

ఈ సమస్య అనికా ఖాతాకే ప్రత్యేకంగా ఉందని ఆమె చెబుతున్నారు. ఎందుకంటే ఆమె వాడుతున్న ఇతర అకౌంట్లలో మ్యూజిక్ ఫీచర్ సాధారణంగానే పనిచేస్తోందట. దీనిని బట్టి ఇది ఒక ఖాతా స్పెసిఫిక్ సమస్యగా అర్థమవుతోంది. కానీ దాని వెనుక కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయంలో ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ నుంచి కూడా స్పష్టమైన సహాయం అందలేదని సమాచారం.

తన బాధను హ్యూమర్‌గా చూపించేందుకు అనికా ఓ ఫోటో కూడా షేర్ చేశారు. బ్లాక్ హుడీ వేసుకుని, సద్దుమణిగిన ముఖంతో ఫోటో తీసి, "ఇన్‌స్టాలో మ్యూజిక్ లేకపోవడం వల్ల నా ముఖం ఇలా అయిపోయింది. ఎవరైనా దీని సొల్యూషన్ తెలిస్తే చెప్పండి" అని క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన అభిమానులు వెంటనే స్పందించి ఆమెకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం అనికా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మ్యూజిక్ లేకపోవడంతో ఆమె పోస్టుల మీద ఫన్నీ రీల్‌లు, స్టోరీల మిస్ అయిపోయాయన్న విషయంలో ఫాలోవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులంతా ఆమె సమస్య త్వరగా పరిష్కారమై, మళ్లీ ఫుల్ ఆనందంగా పోస్ట్ చేసే రోజులొస్తాయని ఆశిస్తున్నారు.