Begin typing your search above and press return to search.

జూనియర్ బుట్ట బొమ్మకి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!

తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ బెంచ్ మార్క్ సినిమా 50వ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:47 AM GMT
జూనియర్ బుట్ట బొమ్మకి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!
X

బుట్ట బొమ్మ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి పూజా హెగ్డే గుర్తుకొస్తుంది అనడం లో సందేహం లేదు. అయితే పూజా హెగ్డే కాకుండా అనిక సురేంద్రన్ ను కూడా బుట్ట బొమ్మ అని ప్రేక్షకులు, మీడియా వర్గాల వారు కూడా పిలుచుకుంటూ ఉంటారు.

అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ఆయనకి కూతురు పాత్రలో నటించిన అనిక ప్రస్తుతం హీరోయిన్గా ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో బుట్ట బొమ్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాపం అనిక కి ఆ సినిమా కలిసి రాలేదు. దానితో తెలుగు లో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.

ఈ సమయం లోనే ఈ ముద్దుగుమ్మకి తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుండి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ బెంచ్ మార్క్ సినిమా 50వ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ధనుష్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనిక కి తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె నటించబోతున్న ధనుష్ 50వ సినిమా కోసం ఇక్కడ కూడా కొందరు ప్రేక్షకులు ఎదురు చూసే అవకాశం ఉంటుంది. సార్ సినిమాతో తెలుగు లో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ తన 50వ సినిమాతో తెలుగులో భారీ వసూళ్లు సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాతో అనిక అక్కడ ఇక్కడ మంచి మార్కులు దక్కించుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.