Begin typing your search above and press return to search.

'మ్యూజిక్ షాప్ మూర్తి' డీజే సాంగ్.. ఫుల్ జోష్ తో!

తాజాగా 'మ్యూజిక్ షాప్ మూర్తి' మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే 'అంగ్రేజీ బీట్' సాంగ్ ను విడుదల చేశారు. 'ఏ మియా మియా' అంటూ సాగుతున్న ఈ పార్టీ సాంగ్.. ఉర్రూతలూగిస్తోంది.

By:  Tupaki Desk   |   18 May 2024 6:31 AM GMT
మ్యూజిక్ షాప్ మూర్తి డీజే సాంగ్.. ఫుల్ జోష్ తో!
X

భాషతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అందుకే టాలీవుడ్ మేకర్స్ గత కొంత కాలంగా విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు తీస్తున్నారు. తాజాగా అలాంటి కథాంశంతో వస్తున్న మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ప్రముఖ యాక్టర్ అజయ్ ఘోష్, హీరోయిన్ చాందినీ చౌదరి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవల ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా 'మ్యూజిక్ షాప్ మూర్తి' మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే 'అంగ్రేజీ బీట్' సాంగ్ ను విడుదల చేశారు. 'ఏ మియా మియా' అంటూ సాగుతున్న ఈ పార్టీ సాంగ్.. ఉర్రూతలూగిస్తోంది. పవన్ లిరిక్స్ రాసి క్రేజీ మ్యూజిక్ అందించారు. యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పవర్ ఫుల్ గా ఈ పాటను పాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

సాంగ్ లో అజయ్ ఘోష్ డీజే గా కనిపిస్తున్నారు. తన వృత్తిని ఫుల్ గా ఆస్వాదిస్తూ స్టెప్పులు అదరగొట్టారు. డీజే రోల్ కోసం అజయ్.. ఫుల్ స్టైలిష్ మేకోవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్ కు డీజే అవ్వాలని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు? ఈ ప్రయాణంలో 25 ఏళ్ల అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని.. అజయ్ ఘోష్ భార్య పాత్రలో కనిపించబోతున్నారు. అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. మరి 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.