Begin typing your search above and press return to search.

ట్రైలర్: అర్జున్ దాస్ ని గట్టిగానే వాడుతున్నారు

వసంత బాలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ట్రైలర్ లో అర్జున్ దాస్ ని ఫుడ్ డెలివరీ బాయ్ గా చూపించారు.

By:  Tupaki Desk   |   15 July 2023 2:44 PM GMT
ట్రైలర్: అర్జున్ దాస్ ని గట్టిగానే వాడుతున్నారు
X

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైది మూవీతో పాపులారిటీ సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్. పెరుమాన్ మూవీతో కోలీవుడ్ లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్ కెరియర్ ఆరంభంలోనే గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఆక్సిజన్ సినిమాలో విలన్ గ్యాంగ్ లో నటించాడు. అయితే కార్తి, లోకేష్ కనగరాజ్ ఖైది మూవీ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

దీని తర్వాత విజయ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ సేతిపతి తర్వాత అంత బలమైన ప్రతినాయకుడి పాత్రలో అర్జున్ దాస్ నటించాడు. ఈ సినిమా అతన్ని ఏకంగా స్టార్ యాక్టర్ గా మార్చేసింది. అలాగే కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం విజయ్ తో లోకేష్ చేస్తోన్న లియో సినిమాలో కూడా బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అర్జున్ దాస్ అడుగుపెట్టాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తమిళంలో అనీతి అనే సినిమాలో బిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో అర్జున్ దాస్ నటించాడు. వసంత బాలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ట్రైలర్ లో అర్జున్ దాస్ ని ఫుడ్ డెలివరీ బాయ్ గా చూపించారు.

బుద్ధిగా జాబ్ చేసుకునే అతనికి కస్టమర్స్ నుంచి అలాగే ఫుడ్ డెలివరీ ఓనర్స్ నుంచి అవమానాలు ఎదురవుతాయి. సంబంధం లేని కేసులలో ఇరికించి పోలీసులతో స్టేషన్ లో కొట్టిస్తారు. ఇలా అడుగడుగునా అవమానాలతో అతనిలోని ప్రతీకారం పెరిగిపోతుంది. అలా ప్రతీకారంతో తనని అవమానించిన, వేధించిన వారిని చంపుకుంటూ వెళ్తాడు.

అలా సమాజంలో వేధింపుల కారణంగా సైకోగా మారిన వ్యక్తిగా అర్జున్ దాస్ రెండు భిన్నమైన షేడ్స్ లో ట్రైలర్ లో చూపించారు. అలాగే మధ్యలో లవ్ స్టొరీని కూడా ఆవిష్కరించారు. ప్రేమలో కూడా మోసపోయిన తన వేదనని ఎవరికి చెప్పుకోలేక సైకో కిల్లర్ గా హత్యలు చేసే వాడిగా అర్జున్ దాస్ క్యారెక్టర్ ని అనీతిలో ఆవిష్కరించారు.

ట్రైలర్ చూస్తుంటే కథ చాలా ఇంటెన్సివ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అర్జున్ దాస్ తనకి అలవాటైన క్రూరమైన పాత్రలో అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. అతను మెయిన్ లీడ్ గా వస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా అర్జున్ దాస్ కెరియర్ లో బెస్ట్ మూవీ కావడంతో పాటు హీరోగా టర్న్ కావడానికి స్కోప్ ఇచ్చే మూవీ అనీతి అవుతుందనే మాట వినిపిస్తోంది.