Begin typing your search above and press return to search.

'సైయారా' బ్యూటీ.. ఈ మూవీస్ చేసిందని తెలుసా?

సైయారా.. సైయారా.. సైయారా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసం చర్చ నడుస్తోంది. సింపుల్ లవ్ స్టోరీతో రూపొందిన ఆ బాలీవుడ్ మూవీ ఇప్పుడు ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   24 July 2025 9:00 PM IST
సైయారా బ్యూటీ.. ఈ మూవీస్ చేసిందని తెలుసా?
X

సైయారా.. సైయారా.. సైయారా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసం చర్చ నడుస్తోంది. సింపుల్ లవ్ స్టోరీతో రూపొందిన ఆ బాలీవుడ్ మూవీ ఇప్పుడు ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. సినీ ప్రియులను ఫుల్ గా మెప్పిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది సినిమా.

అయితే సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. ఇద్దరూ ఆ మూవీతోనే డెబ్యూ ఇచ్చినప్పటికీ.. యాక్టింగ్ తో మాత్రం అదరగొట్టేశారు. ముఖ్యంగా అల్జీమర్స్‌ వ్యాధి బాధితురాలిగా తెరపై అనీత్ పడ్డా యాక్ట్ చేసిన తీరుపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

అంతే కాదు.. పంజాబ్ లోని అమృత్సర్ కు చెందిన ఆమెను లక్కీ బ్యూటీ అని అందరూ పిలుస్తున్నారు. అయితే హీరోయిన్‌ గా అనీత్‌ కు సైయారా ఫస్ట్ మూవీ. కానీ ఇప్పటికే ఆమె సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. ఓ సినిమాతోపాటు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. పలు యాడ్స్ లో కూడా కనిపించింది. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన అనీత్ పడ్డా.. సినిమాల్లోకి రావాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యింది. అందుకు అనుగుణంగా ఫస్ట్ మోడల్ గా మారింది. ఆ తర్వాత పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేసింది. మూడేళ్ల క్రితం రూపొందిన క్యాడ్‌ బరీ యాడ్‌ తో పాపులర్ అయింది. ఆ సమయంలో ఆమె అందానికి చాలా మంది ఫ్లాట్ అయ్యారు.

క్యాడ్ బరీతోపాటు నెస్ కేఫ్, పేటీఎం, అమెజాన్ ప్రైమ్ యాడ్స్ లో కూడా కనిపించింది. మరోవైపు, 2002లో సీనియర్ బ్యూటీ కాజోల్‌ నటించిన సలామ్‌ వెంకీ సినిమాతోనే బాలీవుడ్‌ కు పరిచయమైంది. ఆ సినిమాలో నందినిగా కనిపించింది. ఆ తర్వాత గత ఏడాది వచ్చిన బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై అనే వెబ్‌ సిరీస్‌ లో రూహీగా యాక్ట్ చేసింది.

బోర్డింగ్‌ స్కూల్‌ డ్రామాగా సాగే ఆ సిరీస్ లో రెబల్ అమ్మాయి రోల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే సింగర్ గా కూడా ఎంతో మందికి అనీత్ పరిచయం. మసూమ్ అనే ఆల్బమ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని లైమ్ లైట్ లోకి వచ్చేసింది.