Begin typing your search above and press return to search.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన సైయారా బ్యూటీ.. ఆ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం

ఒక్కొక్కసారి అదృష్టం ఎలా ఉంటుంది అంటే అనూహ్యంగా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత వారికి వరుసగా అవకాశాలు కూడా తలుపుతడతాయి.

By:  Tupaki Desk   |   22 Oct 2025 12:00 AM IST
లక్కీ ఛాన్స్ కొట్టేసిన సైయారా బ్యూటీ.. ఆ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం
X

ఒక్కొక్కసారి అదృష్టం ఎలా ఉంటుంది అంటే అనూహ్యంగా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత వారికి వరుసగా అవకాశాలు కూడా తలుపుతడతాయి. అలా ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాతోనే భారీ విజయాలను సొంతం చేసుకుని.. వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ జాబితాలోకి 'సైయారా' బ్యూటీ కూడా వచ్చి చేరింది. బాలీవుడ్ లో ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇందులో నటించింది కొత్త నటీనటులు.. అయినా సరే ఏకంగా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కథ కథనంతో పాటు లీడ్ రోల్స్ చేసిన అద్భుతమైన పర్ఫామెన్స్ ముఖ్య కారణం అని చెప్పవచ్చు.

ప్రముఖ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే, అనీత్ పడ్డా.. ఇద్దరికీ ఈ సినిమా తొలి సినిమానే అయినా ఏదో నటనలో పూర్తి అనుభవం ఉన్న నటీనటుల్లా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. యువత ఈ చిత్రానికి ఎంతలా కనెక్ట్ అయ్యింది అంటే సినిమా పూర్తి అయిన తర్వాత థియేటర్లలోనే ఏడ్చేసిన ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రానికి యువత కనెక్ట్ అయ్యి ఏడ్చిన ఏకైక చిత్రం ఈ సైయారా అని చెప్పవచ్చు.

ఈ సినిమాతో ఇద్దరికీ అభిమానులు తమ గుండెల్లో గుడి కట్టేశారు అనడంలో సందేహం లేదు. అటు అహాన్ పాండే కూడా ఒక భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోగా.. ఇప్పుడు అనీత్ పడ్డా కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతోందని మేకర్స్ స్వయంగా ప్రకటించడంతో అనీత్ పడ్డా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే.. అందం , అభినయంతో అందరినీ ఆకట్టుకున్న అనీత్ పడ్డాతో సైయారా విడుదలకు ముందే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఇంకో మూడు చిత్రాలకు ఆమెతో అగ్రిమెంట్ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వేరే ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కూడా ఈమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు మరోవైపు ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యానర్లలో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ కూడా ఈమెతో ఒక క్రేజీ మూవీ చేయడానికి ప్లాన్ చేసింది.

ఇక అందులో భాగంగానే తాజాగా మ్యాడ్ డాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా ఈరోజు భారీ ఎత్తున విడుదలైన చిత్రం థామా. ఈ సినిమా చివర్లో ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమా విశేషాలను పంచుకుంది మ్యాడ్ డాక్ ఫిలిం సంస్థ. 'శక్తి షాలిని' పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో అనీత్ పడ్డా లీడ్ రోల్ చేయనుంది అంటూ తెలిపింది. అయితే థామా హిందీ వెర్షన్ లో ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులు చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. రొమాంటిక్ చిత్రం సైయారాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న అనీత్ పడ్డా ఇప్పుడు ఈ సినిమాలో హారర్ పాత్రలో కనిపించబోతుందని తెలిసి ఎక్సైట్మెంట్ కనబరుస్తున్నారు.

ఈమధ్య మ్యాడ్ డాక్ హారర్ కామెడీ చిత్రాలంటే బ్లాక్ బస్టర్ అని నార్త్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు కూడా.. పైగా మంచి రేటింగ్ కూడా లభిస్తోంది.ఇప్పుడు శక్తి షాలిని అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడంతో అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూడడం మొదలు పెట్టారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ లో భాగం కాబోతున్న అనీత్ పడ్డా ఈ సినిమాతో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.