Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆండ్రియా చాలా కాలానికి ఇలా

గాయ‌ని కం న‌టి ఆండ్రియా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పాపుల‌ర్ యువ‌సంగీత ద‌ర్శ‌కుడితో ప్రేమాయ‌ణం సాగించి చివ‌రికి బ్రేక‌ప్ తో డిప్రెష‌న్ ని ఫేస్ చేసింద‌ని త‌మిళ మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   30 Nov 2023 9:30 AM GMT
ఫోటో స్టోరి: ఆండ్రియా చాలా కాలానికి ఇలా
X

గాయ‌ని కం న‌టి ఆండ్రియా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పాపుల‌ర్ యువ‌సంగీత ద‌ర్శ‌కుడితో ప్రేమాయ‌ణం సాగించి చివ‌రికి బ్రేక‌ప్ తో డిప్రెష‌న్ ని ఫేస్ చేసింద‌ని త‌మిళ మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. చాలా కాలం క్రితం త‌న ఒత్తిళ్ల జీవితం గురించి అనారోగ్యం గురించి క‌ల‌త చెందాన‌ని ఆండ్రియా వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి అన్నివిధాలా కెరీర్ పైనే ఆండ్రియా దృష్టి సారించింది.


ఆండ్రియా హీరోయిన్ గానే కాదు.. త‌న‌దైన‌ హ‌స్కీ వాయిస్ తో తెలుగు -త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో గాయ‌నిగా పేరు తెచ్చుకుంది. నాగ‌చైత‌న్య `ద‌డ‌` స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో త‌న‌దైన గానంతో అల‌రించింది. `యుగానికి ఒక్క‌డు` చిత్రంతో కథానాయిక‌గా స్పైసీ లుక్ తో అల‌రించింది. ఆండ్రియా న‌టించిన వరుస చిత్రాలు తెలుగులో విడుద‌ల‌య్యాయి. కొన్ని డ‌బ్బింగులు ఆక‌ట్టుకున్నాయి. కానీ ఎందుక‌నో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేక రేసులో వెన‌క‌బ‌డింది.

మరోవైపు ఆండ్రియా సోష‌ల్ మీడియాల్లోను యాక్టివ్ గా ఉంది. తాజాగా ఆండ్రియా డెనిమ్ షార్ట్ లో ఉన్న అంద‌మైన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో ఆండ్రియా ఎంతో సింపుల్ గా క‌నిపిస్తోంది. డెనిమ్ షార్ట్ కి త‌గ్గ‌ట్టుగా టాప్ లో బ‌నియ‌న్ ని ఎంపిక చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఆండ్రియా ఇటీవ‌ల పూర్తిగా కెరీర్ పైనే శ్ర‌ద్ధ పెట్టింది. ఇంత‌కుముందు మాస్ట‌ర్ చిత్రంలో ఆండ్రియా కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఇటీవ‌ల నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇవ‌న్నీ సెట్స్ లో ఉన్నాయి. క‌మ‌లా క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `వ‌ట్టామ్`.. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో `పిసాసు-2` లో న‌టించింది. కా - మాలిగై- నో ఎంట్రీ స‌హా మ‌రో రెండు చిత్రాల్లోను ఆండ్రియా న‌టించింది. బాబి ఆంటోని, దినేష్ సెల్వ‌రాజ్ తెర‌కెక్కిస్త‌న్న సినిమాల్లో ను న‌టిస్తోంది.