ఎల్లో చీరలో ముద్దొచ్చేస్తున్న ఆండ్రియా..ఫోటోలు వైరల్
ఎల్లో కలర్ సారీలో రెడ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసి అచ్చ తెలుగు ఆడపిల్ల లాగా కనిపించింది. ఎల్లో కలర్ శారీలో ఆండ్రియా ని చూసిన చాలామంది వింటేజ్ లుక్ ని తీసుకు వచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2025 5:00 PM ISTఆండ్రియా జెర్మియా.. పేరుకు తమిళ నటే అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా పేరున్న హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ అలాంటి పాత్రలకి కేరాఫ్ అడ్రస్.. సీన్ డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి పాత్రలో అయినా సరే అద్భుతంగా నటిస్తుంది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా శారీలో ఉన్న ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఎల్లో కలర్ సారీలో రెడ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసి అచ్చ తెలుగు ఆడపిల్ల లాగా కనిపించింది. ఎల్లో కలర్ శారీలో ఆండ్రియా ని చూసిన చాలామంది వింటేజ్ లుక్ ని తీసుకు వచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సాంప్రదాయమైన చీరకట్టుతో పాటు చెవులకు బుట్టాలు పెట్టి కొప్పు వేసుకుని దాని చుట్టూ రెడ్ రోజ్ లు పెట్టుకోవడంతో ఈమె ఫొటోస్ చూసిన చాలామంది రెడ్ రోజులా మెరిసిపోతున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆండ్రియా జెరేమియాకి సంబంధించిన ఈ చీర కట్టు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..
ఆండ్రియా జెరేమియా సినిమాలు, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చెన్నైలో పుట్టి పెరిగిన ఆండ్రియా జెరేమియాకి చిన్నప్పటి నుండే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అలా చిన్నప్పటినుండే ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చేది. ఆ తర్వాత 2005లో కంద నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్నో తమిళ, హిందీ,మలయాళ, తెలుగు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో రాణించింది. ఇక తెలుగులో ఈ హీరోయిన్ డైరెక్ట్ గా చేసిన ఫిల్మ్ తడాఖా..అక్కినేని నాగచైతన్య,సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాఖా మూవీలో తమన్నా, ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేశారు.ఇందులో ఆండ్రియా సునీల్ సరసన నటించింది. ఆ తర్వాత ఆండ్రియా తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.
ఆండ్రియా నవంబర్ 21న మాస్క్ అనే మూవీ తో మన ముందుకు రాబోతుంది.కవిన్ రూహానీ శర్మ నటిస్తున్న మాస్క్ మూవీలో ఆండ్రియా కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే కా-ది ఫారెస్ట్, వాడి వసల్, మానుషి,అరసన్ అనే సినిమాల్లో కూడా ఆండ్రియా నటిస్తోంది.
