Begin typing your search above and press return to search.

రాజమండ్రిలో 'ఆంధ్రా కింగ్ తాలూకా'.. క్రేజీ షెడ్యూల్ షురూ..

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఫ్యాన్ బయోపిక్ గా రానున్న ఆ ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ సాగర్ అనే అభిమాని పాత్రలో కనిపించనున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:35 AM IST
రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా.. క్రేజీ షెడ్యూల్ షురూ..
X

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి.మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.


కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఫ్యాన్ బయోపిక్ గా రానున్న ఆ ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ సాగర్ అనే అభిమాని పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.


అయితే ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూల్స్ లో చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు మేకర్స్. తాజాగా రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. అక్కడ రామ్, ఉపేంద్ర సహా మెయిన్ క్యాస్టింగ్ పై పలు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టేశారు.

అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో రామ్, రావు రమేష్ కు సీన్స్ ను నెరేట్ చేస్తూ కనిపించారు మేకర్స్. కాగా, సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనతోపాటు మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వి.టి.వి. గణేష్ వంటి ప్రముఖ నటీనటులు మూవీలో యాక్ట్ చేస్తున్నారు.

సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరిస్తుంటగా, వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌ గా వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సున్నితమైన వినోదంతో పాటు మనసును హత్తుకునే కథాంశంతో అందరూ కనెక్ట్ అయ్యేలా మూవీ తీస్తున్నారట.

సెప్టెంబర్ 2న రామ్ బర్త్ డే కనుక.. ఆ రోజు సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అందుకు గాను త్వరలో అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. అయితే రామ్.. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకాతో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.