Begin typing your search above and press return to search.

హిట్ ల‌వ్ స్టోరీ సీక్వెల్ లో హీరోని త‌ప్పించిన హీరో!

తొలిసారి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు తాజాగా అమీర్ ఖాన్ ప్ర‌క‌టించారు. అమీర్ ఖాన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   16 March 2024 11:30 PM GMT
హిట్ ల‌వ్ స్టోరీ సీక్వెల్ లో హీరోని త‌ప్పించిన హీరో!
X

స‌ల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్...ర‌వీనా టాండ‌న్..క‌రీష్మా క‌పూర్ న‌టించిన 'అందాజ్ అప్నా అప్నా' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. రాజ్ కుమార్ సంతోషి తెర‌కెక్కించిన సినిమా ఈ కాంబినే ష‌న్ దెబ్బ‌కి బాక్సాఫీస్ షేక్ అయింది. బాలీవుడ్ క్లాసిక్ ల‌వ్ స్టోరీల్లో 'అందాజ్ అప్నా అప్నా' కూడా ఒక‌టిగా నిలిచింది. మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అమ‌ర‌..ప్రేమ్ లు ఓ కోటీశ్వ‌రుడి కుమార్తెల మ‌న‌సులు గెలుచుకోవాల‌నే అంశంతో ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ వ‌స్తే అంత‌కు మించిన సంతోషం ఇంకెక్క‌డ అంటూ అభిమానులు అభిప్రాయాలు చెప్పిన సంద‌ర్భాలెన్నో. కానీ ద‌ర్శ‌కుడు గానీ...న‌టీన‌టులు గానీ ఇంత‌వ‌ర‌కూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. తొలిసారి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు తాజాగా అమీర్ ఖాన్ ప్ర‌క‌టించారు. అమీర్ ఖాన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని రివీల్ చేసారు. ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ సంతోషీ ఈ క‌థ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

ఇది ప్రారంభ ద‌శ‌లో ఉంది. అతి త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం' అన్నారు. అయితే ఇందులో స‌ల్మాన్ ఖాన్ లేడ‌నే ప్ర‌చారం కూడా సాగుతంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లీడ్ తీసుకుంది కేవ‌లం అమీర్ ఖాన్ మాత్ర‌మేన‌ని...స‌ల్మాన్ ఖాన్ కి ఎలాంటి సంబంధం లేద‌నే వాద‌న వినిపిస్తుంది. అమీర్ ఖాన్ కోరిక మేర‌కే ద‌ర్శ‌కుడు క‌థ సిద్దం చేస్తున్నార‌ని..ఇప్ప‌టి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు స్టోరీ రాసి పూర్తిగా ఇప్ప‌టిత‌రం న‌టీన‌టుల‌తోనే చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అమీర్ ఖాన్ కేవ‌లం నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తారాని..పాత్ర‌ల పుట్టించ‌డం వ‌ర‌కూ ఆయ‌న ప‌రిమి త‌మ‌ని వినిపిస్తుంది. మ‌రి ఈ ప్రచారం నిజామా? కాదా? అన్న‌ది తెలియాలి. అలా కాకుండా ఈ సీక్వెల్ లో స‌ల్మాన్..అమీర్ కొన‌సాగుతారా? అన్న‌ది చూడాలి. ఏది ఏమైనా అమ‌ర్..ప్రేమ్ ల సందండైతే తెర‌పై క‌నిపిస్తుంద‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్...అమీర్ ఖాన్ వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.