రీరిలీజ్ కు రెడీ అయిన మరో టాలీవుడ్ క్లాసిక్
పదమూడేళ్ల కిందట రిలీజై టాలీవుడ్ అండర్ రేటెడ్ క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన అందాల రాక్షసి సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:05 AMఇప్పుడు టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం హిట్టు సినిమాలను మాత్రమే కాకుండా ఓ మాదిరిగా నిలిచిన సినిమాలను కూడా రీరిలీజ్ చేసి రచ్చ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అవగా, వాటిలో కొన్ని సినిమాలు రికార్డులు కూడా సృష్టించాయి. రీరిలీజై టాప్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టాప్ లో ఉంది.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో సినిమా రీరిలీజ్ కు రెడీ అయింది. పదమూడేళ్ల కిందట రిలీజై టాలీవుడ్ అండర్ రేటెడ్ క్లాసిక్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన అందాల రాక్షసి సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా తెలుగు ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన టైమ్ లో థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు కానీ ఆ తర్వాత మాత్రం క్లాసిక్ గా మారింది. ఈ సినిమాతోనే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందాల రాక్షసి సినిమాను జూన్ 13న రీరిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
భిన్నమైన లవ్ స్టోరీ, లోతైన ఎమోషన్స్ తో ఆడియన్స్ మనసులో నిలిచిపోయేలా డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు రధన్ మ్యూజిక్ అందించగా, ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్ నిలిచాయి. అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అందాల రాక్షసి ఈ సారి రీరిలీజ్ తో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.