Begin typing your search above and press return to search.

ఈ పుకార్ల‌తో పిల్ల‌లు ఎంత‌గా ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారో!

సీనియ‌ర్ యాంక‌ర్ సుమ -రాజీవ్ కనకాల జంట‌ విడాకుల గురించి చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజీవ్ వీటిని ఖండించినా పుంఖానుపుంఖాలుగా ఇలాంటి పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 July 2023 5:10 AM GMT
ఈ పుకార్ల‌తో పిల్ల‌లు ఎంత‌గా ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారో!
X

సీనియ‌ర్ యాంక‌ర్ సుమ -రాజీవ్ కనకాల జంట‌ విడాకుల గురించి చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజీవ్ వీటిని ఖండించినా పుంఖానుపుంఖాలుగా ఇలాంటి పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. నిజానికి సుమ ఇలాంటి వాటిని అస్స‌లు ప‌ట్టించుకోరు. కానీ రాజీవ్ కనకాల ఈ పుకార్ల గురించి సీరియ‌స్ గానే ప‌ట్టించుకుంటాన‌ని అన్నారు. అంతకుముందు జరిగిన సంఘటనల గురించి ఆయ‌న ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన‌య్యారు.

ఒకానొక‌ సమయంలో ఓ మూవీ కోసం తీవ్ర‌మైన వేడిలో షూటింగ్ చేసి ఎంతో అలసిపోయాను.. నా చర్మం మెరుపును కోల్పోయింది. మేము పార్టీలకు హాజరైనప్పుడు.. నేను ఎందుకు పాలిపోయి నీరసంగా ఉన్నాను? అని సుమను అడిగేవారు. వారు నా వృత్తిపరమైన నిబద్ధతను అర్థం చేసుకోలేదు.. వైవాహిక జీవితంలో అంతా బాగానే ఉందా..? అని ప్రశ్నించడం ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు! అని రాజీవ్ చెప్పారు.

ఈ విడాకుల పుకార్లను ఎవరు ప్రారంభించారు? ఎందుకిలా చేస్తున్నారు? అని నేను మ‌ద‌న‌ప‌డ్డాను. సుమ దానిని తేలికగా తీసుకుంది. కానీ నాకు ఆందోళన కలిగించింది. ఈ పుకార్లు చదివి నా కుటుంబం కూడా అయోమయంలో పడింది. అమెరికాలోని మా కుటుంబ సభ్యులు కూడా దాని గురించి ఆందోళన చెందారు. అంతా బాగానే ఉందా? అని మమ్మల్ని అడిగేవారు. నేను దీంతో ఎంతో క‌దిలిపోయాను. మేం క‌లిసే ఉన్నాం అని చెప్పేందుకు సుమ షోల‌కు కూడా వెళ్లాల్సి వచ్చింది... మేము క‌లిసే ఉన్నాం`` అని వివ‌ర‌ణ ఇచ్చారు క‌న‌కాల‌. ఇలాంటి పుకార్ల‌తో త‌మ పిల్ల‌లు ఎంత‌గా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారోన‌ని ఆందోళ‌న చెందిన‌ట్టు రాజీవ్ క‌న‌కాల వెల్ల‌డించారు.