Begin typing your search above and press return to search.

అనసూయ గ్లామర్.. ఈసారి ఇంకాస్త కొత్తగా..

సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 9:44 AM GMT
అనసూయ గ్లామర్.. ఈసారి ఇంకాస్త కొత్తగా..
X

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అనసూయ. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నటిగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. వరుస సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలతో సందడి చేస్తుంటుంది.


సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తుంటుంది. అక్కడ ఫుల్ చిల్ అవుతూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ తో పోస్ట్ చేసి అట్రాక్ట్ చేస్తుంటోంది. అప్పుడప్పుడు తన భర్త శశాంక్, ఇద్దరి పిల్లలతో దిగిన కంప్లీట్ ఫ్యామిలీ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు మళ్లీ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేసింది.


ఇటీవలే విండో పక్కన కూర్చుని కాఫీ తాగుతూ దిగిన కిర్రాక్ ఫొటోలను షేర్ చేసిన అనసూయ.. తాజాగా ఓ టూరిస్ట్ ప్లేస్ లో తీసుకున్న పిక్స్ ను పోస్ట్ చేసింది. ట్రెండీ క్యాప్ పెట్టుకుని, స్కై బ్లూ కలర్ సింగిల్ పీస్ డ్రెస్ లో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ పెంచింది. కొన్ని ఫొటోల్లో క్యూట్ గా.. మరికొన్ని పిక్స్ లో క్లైమేట్ చాలా హాట్ గా ఉన్నట్లు పోజులు ఇచ్చింది. 2024లో ఫస్ట్ వెకేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసింది.


ప్రస్తుతం అననూయ. క్యారెక్ట‌ర్ రోల్స్‌, విల‌న్ పాత్ర‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. 2023లో తెలుగులో ఆమె న‌టించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మైఖేల్‌, రంగ‌మార్తాండ‌, విమానం, పెద‌కాపు, ప్రేమ విమానం చిత్రాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది అనసూయ. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పుష్ప 2లో నెగెటివ్ షేడ్ రోల్‌లో క‌నిపించబోతోంది.


మరోవైపు, ఫ్లాష్‌ బ్యాక్ అనే మూవీతో కోలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ అమ్మడు. ప్ర‌భుదేవా హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ తో పాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాల‌కు అన‌సూయ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు సమాచారం. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన భీష్మ‌ప‌ర్వంలో అన‌సూయ కీల‌క పాత్ర పోషించింది. అలా అనసూయ.. చేతినిండా మూవీలతో బిజీ బిజీగా గడుపుతోంది.