Begin typing your search above and press return to search.

అనసూయ లిప్ స్టిక్ బాలేదా?

యాంకర్ గా బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో అనసూయ భరద్వాజ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   3 April 2024 9:42 AM GMT
అనసూయ లిప్ స్టిక్ బాలేదా?
X

యాంకర్ గా బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో అనసూయ భరద్వాజ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు. తెలుగులో అప్పటివరకు యాంకర్ అనగానే కేవలం మాటలతోనే ఆకట్టుకుంటారు అనే అర్ధానికి ఆమె తన గ్లామర్ తో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. చాలా కాలం పాటు పోటీ లేకుండా కొనసాగిన అనసూయ ఇప్పుడు వెండితెరపై కూడా అదే తరహాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు.


రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లలో కూడా కనిపిస్తోంది. అలాగే పాజిటివ్ రోల్స్ అనే మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ వస్తే కూడా చాలా చక్కగా నటిస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ కు ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు.


అంతకు ముందు రంగస్థలంలో కూడా రంగమ్మత్తగా కనిపించి తన స్థాయిని పెంచుకుంది. అనసూయ 2003 లోనే నాగ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్న కాలం పాటు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేసిన ఆమె అనంతరం జబర్దస్త్ షో ద్వారా సరికొత్తగా తన కెరియర్ స్టార్ట్ చేసింది. ఇక అనసూయ ఇప్పటివరకు 30కి పైగా సినిమాలలో నటించింది.


అనసూయ భరద్వాజ్ ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో కంటెంట్ బలంగా ఉంటుంది అని ఒక మంచి నమ్మకం ఏర్పరచుకుంది. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసిన అనసూయ పలు వెబ్ సిరీస్ లలో కూడా కనిపించింది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి.


ఇక అనసూయ భరద్వాజ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె ఇంతకంటే ఘాటైన డ్రెస్సులాలో కనిపించినప్పటికీ ఈ లుక్కులో మాత్రం మరింత అందంగా ఉంది అంటూ మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆమె తన స్టిల్స్ తో కంటే తన చూపులతోనే ఎక్కువ గ్లామర్ ను హైలైట్ చేస్తుంది అని అంటున్నారు.

అంతేకాకుండా తన నవ్వుతూనే కుర్రాళ్ళు మనసుల్ని దోచుకుంటుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆమె గ్లామర్ కు చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాప్పటికీ ఓ వర్గం వారు మాత్రం ఆమె లిప్ స్టిక్ అంతగా బాగోలేదు అని రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అనసూయ వాటిని పెద్దగా పట్టించుకోదు అని చాలాసార్లు ఆమె చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.