Begin typing your search above and press return to search.

సముద్రతీరంలో అనసూయ బికినీ ట్రీట్.. స్టన్నింగ్

సముద్ర తీరంలో తెల్లని బికినీలో కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. సూర్యాస్తమయం లో అలా జలకన్యలా అమ్మడు సముద్రతీరానికి మరింత అందం తీసుకు వచ్చింది అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 7:47 AM GMT
సముద్రతీరంలో అనసూయ బికినీ ట్రీట్.. స్టన్నింగ్
X

గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. హీరోయిన్లకు పోటీగా నిలిచే అందం ఆమెది. మొదట యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం బుల్లితెరపై గ్లామర్ తో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చారు. ఇక అనసూయకి ముందు కూడా చాలా మంది యాంకర్లు ఉన్నారు. అయితే యాంకరింగ్ కి గ్లామర్ సొగసులతో సరికొత్తగా తన క్రేజ్ పెంచుకుంది.

ఇక యాంకర్ గా అలా కొనసాగుతున్న తన కెరీర్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై మరింత హైలెట్ అవుతోంది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ట్రెండీ దుస్తుల్లో అమ్మడు ఫోటోలను షేర్ చేస్తూ, ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో మరోసారి తన గ్లామర్ తో స్టన్ అయ్యేలా కనిపించింది

సముద్ర తీరంలో తెల్లని బికినీలో కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. సూర్యాస్తమయం లో అలా జలకన్యలా అమ్మడు సముద్రతీరానికి మరింత అందం తీసుకు వచ్చింది అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఫ్యామిలీతో కలిసి ఇటీవల అనసూయ ట్రిప్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనసూయ బికినీలో కనిపించింది. కానీ ఈసారి మరింత అందంగా ఉందని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు. మొదటి భాగంలోనూ ఆమె చేసిన పాత్ర బాగా క్లిక్కయ్యింది. రెండో భాగంలో ఆ క్యారెక్టర్ మరీంత పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చివరగా నటించిన విమానం సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ అనసూయ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇక కమర్షియల్ గా ఈ మూవీ పెద్ద గా క్లిక్ కాకపోయినా ఓటీటీలో మాత్రం పరవాలేదు అనేలా విశేష ఆదరణ దక్కింది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ లోను అనసూయకు మంచి పాత్ర దక్కింది. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.