Begin typing your search above and press return to search.

అనసూయ: ట్రెడిషన్ డ్రెస్సులో కూడా.. అదే గ్లామర్ డోస్

జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత టెలివిజన్ ప్రపంచంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది

By:  Tupaki Desk   |   11 March 2024 1:42 PM GMT
అనసూయ: ట్రెడిషన్ డ్రెస్సులో కూడా.. అదే గ్లామర్ డోస్
X

జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత టెలివిజన్ ప్రపంచంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్థం తీసుకొచ్చిన ఆమె గ్లామర్ తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక తర్వాత వెండితెరపై మొదలైన ప్రయాణం మరింత దూకుడుగా కొనసాగింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో వెళ్లకుండా మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్ లను సెలెక్ట్ చేసుకుంటూ తన క్రేజ్ పెంచుకుంది.

అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. అనంతరం మెల్లగా టెలివిజన్ ప్రపంచానికి బ్రేక్ ఇచ్చిన అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో మరింత ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఆమె ఎంత స్టైలిష్ డ్రెస్ వేసినా, అలాగే ఎంత ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా కూడా గ్లామర్ మాత్రం అస్సలు తగ్గదు. ఆ విషయంలో మిగతా వారికి గట్టి పోటీని ఇస్తుంది అని చెప్పవచ్చు.

ఇక రీసెంట్ గా అనసూయ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా ఆమె పోస్ట్ చేసింది. లంగా వోని లో కనిపించిన అనసూయ భరద్వాజ్ వయ్యారంగా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా మరొక లుక్కులో గాగుల్స్ పెట్టుకుని తన స్మైల్ తోనే కుర్రాళ్ల మతి పోగొట్టేసిందే.

గతంలో బికినీలో కూడా కనిపించిన అనసూయ ఈ లంగా వోని పిక్ లో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. హఫ్ శారీలో అనసూయ వయసు ఇంకా తగ్గింది అని మరి కొందరు అంటున్నారు. ఇక ఆమె పిల్లలకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా అనసూయ షేర్ చేసుకుంది.

ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికి.. వస్తే రంగస్థలం తర్వాత ఇండస్ట్రీలో మరింత బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. పాజిటివ్ నెగిటివ్ అని సంబంధం లేకుండా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ వస్తే ఏమాత్రం విడిచి పెట్టడం లేదు. పుష్ప సినిమాతో కూడా నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఇక రాబోయే పుష్ప 2లో మరింత వైలెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే క్రిష్ దర్శకత్వంలో కూడా అనసూయ ఒక వెబ్ ప్రాజెక్ట్ చేస్తోంది లిస్టులో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మరి వాటితో అమ్మడు తన క్రేజ్ ను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.