Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మేడం జబర్దస్త్‌ క్లిక్స్‌

లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో హీరోయిన్‌ స్థాయి పాత్రలు దక్కించుకుని మరీ కెరీర్‌ లో దూసుకు పోతుంది

By:  Tupaki Desk   |   6 March 2024 5:59 AM GMT
పిక్ టాక్ : మేడం జబర్దస్త్‌ క్లిక్స్‌
X

జబర్దస్త్‌ కామెడీ షో కి యాంకర్ గా చేయడం ద్వారా హీరోయిన్స్ రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకున్న అనసూయ సినిమాల్లో హీరోయిన్స్ కి తగ్గకుండా పలు పాత్రల్లో నటించింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో హీరోయిన్‌ స్థాయి పాత్రలు దక్కించుకుని మరీ కెరీర్‌ లో దూసుకు పోతుంది.

ఈ మధ్య కాలంలో బుల్లి తెరకు దూరం అయ్యి పూర్తిగా వెండి తెరపై దృష్టి పెట్టింది. ఆ మధ్య రంగస్థలం ఆ తర్వాత పుష్ప సినిమాల్లో అనసూయ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఐటం సాంగ్స్ కూడా చేసి మంచి పేరు దక్కించుకున్న అనసూయ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్‌ మీడియా లో రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలతో వైరల్‌ అవుతున్న అనసూయ తాజా చీర కట్టు ఫోటోలతో మేడం సర్ మేడం అంతే అనే బన్నీ డైలాగ్‌ గుర్తుకు తెచ్చే విధంగా చాలా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయ నటిగా బిజీగా ఉంది. అంతే కాకుండా ఆమె అందంతో హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది. ముందు ముందు అనసూయ మరింతగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం ఖాయం అని ఈ అందమైన ఫోటోలను చూస్తే అనిపిస్తోంది.