నాదన్నది ఏదీ వదలను.. అందుకే ఐటీ రైడ్స్ జరిగాయి
యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి ఓ వైపు టీవీ షో లకు జడ్జిగా, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉంటుంది
By: Tupaki Desk | 20 May 2025 7:22 PM ISTయాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి ఓ వైపు టీవీ షో లకు జడ్జిగా, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉంటుంది. రీసెంట్ గా అనసూయ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా హోస్ట్ చేస్తున్న నిఖిల్ తో నాటకాలు పాడ్‌కాస్ట్‌కు హాజరై, పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడింది.
ఆడ, మగ అంటే ఎట్రాక్షన్ ఉండటం నేచురల్. సినిమా వాళ్లపై జనం ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పిన అనసూయ తనకు నైన్త్ క్లాస్ లోనే ప్రపోజల్స్ మొదలయ్యాయని, అప్పటినుంచే తప్పించుకోవడం అలవాటైందని చెప్పింది. సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన అనసూయ, తన టాలెంట్ ఏంటో? తానెంత వరకు చేయగలననేది తనకు తెలుసని, డైరెక్టర్లు, రైటర్లు చెప్పే కథకు సూటవనని అనిపిస్తే తనకు తానుగా తప్పుకున్న సిట్యుయేషన్స్ ఎన్నో ఉన్నాయని అనసూయ తెలిపింది.
జబర్దస్త్ లో హైపర్ ఆదితో కలిసి చేసిన స్కిట్స్ చాలానే హైలైట్ అయ్యాయని, ఆడ, మగ సంబంధాలు, ఎదురింటి పెళ్ళాంపై వేసే జోకులు జబర్దస్త్ లో ఉంటాయి. ఆ షో కు హోస్ట్ గా చేసినందుకు గర్వంగా ఫీలవుతా అని చెప్పిన అనసూయ, అక్కడి జోకులకు అనసూయ నవ్వు నటిస్తుందని, స్క్రీన్ పై కనిపించే అనసూయ వేరు, బయట కనిపించే అనసూయ వేరని, కొన్ని సందర్భాల్లో జోకుల తీవ్రత ఎక్కువైనప్పుడు తాను స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ షో లో ఏమేం టెలికాస్ట్ చేయాలనేది ఎడిటింగ్ రూమ్ డిసైడ్ చేస్తుందని అనసూయ తెలిపింది.
గతంలో ప్రతీ గురువారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలి. ఏదొక ఫోటో షూట్ ను అప్ లోడ్ చేయాలనే ఒత్తిడి ఉండేది. ఫలానా బట్టలే వేసుకోవాలి. ఇది వేసుకోకూడదనే లాంటి ఒత్తిడిలను చాలానే తట్టుకున్నానని, నన్ను నన్నుగా ఇష్టపడే వారి కోసం షోలు, సినిమాలు, డైలీ లైఫ్ లో జరిగే అంశాలను కచ్ఛితంగా షేర్ చేసుకుంటానని అనసూయ చెప్పింది.
అనసూయకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 కోట్లు పెట్టి కారు కొనిందా అని అంటుంటారు. అలాంటి కారు కొన్నానంటే అది కేవలం నా ఒక్కదాని కష్టం కాదని, దాని వెనుక నా ఫ్యామిలీ కష్టం కూడా ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. తనకెంత ఆస్తి ఉందనేది తానెప్పుడూ లెక్కలు వేసుకోలేదని, తనకు తెలిసిందల్లా హాలీడే ట్రిప్స్, ఎంజాయ్‌మెంట్స్ మాత్రమేనని అనసూయ పేర్కొంది.
ఇప్పటికీ తనదొక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ మెంటాలిటీనే అని, లైఫ్ తనకు నేర్పిన పాఠాలను చూసి ఇప్పటికీ పోపుల డబ్బాలో డబ్బులను దాచుకుంటానని చెప్పింది అనసూయ. ఆఫర్లు బాగా వచ్చి బాగానే సంపాదించానని చెప్పిన అనసూయకు జీఎస్టీ అనేది ఒకటుంటుందని తనకు తెలియదని, కొన్ని షో లకు ట్యాక్స్ కట్టకపోవడంతో పొరపాటు జరిగి తనపై ఐటీ రైడ్స్ జరిగాయని అనసూయ వెల్లడించింది.
తాను, తన భర్త ఎంతో కష్టపడి నెలకు రూ. లక్షా పదహారు వేల ఈఎంఐ కడుతూ కొనుకున్న ఆడి కారును తనకెవరో ప్రొడ్యూసర్ గిఫ్ట్ గా ఇచ్చాడని ఎన్నో వార్తలొచ్చాయి. జీవితంలో పైకి రావడానికి కష్టపడతానని, నాది కానిదేదీ నాకొద్దని చెప్తున్న అనసూయ, నాదన్నది రూపాయి కూడా వదలనని చెప్తోంది. ఇక తనను ఆంటీ అనేవాళ్ల గురించి మాట్లాడుతూ తానే బట్టలేసుకుని తిరిగితే ఎవరికేం నష్టమేంటి అని ప్రశ్నించింది. పవన్ తో కలిసి వీరమల్లులో ఓ సాంగ్ లో నటించిన అనసూయ ఆయన ఎన్నో విషయాలకు నో, ఎన్నో విషయాలకు ఎస్ చెప్పబట్టే ఇవాళ ఈ స్థాయికి వచ్చారని, మెగా బ్రదర్స్ ముగ్గురూ స్వీట్ హార్ట్స్ అని వారందరితో కలిసి నటించే లక్ తనకు దక్కిందని అనసూయ తెలిపింది.
