అనసూయ తండ్రిని వెంటాడుతున్న బాధ!
బుల్లి తెర యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 5:51 PM ISTబుల్లి తెర యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకరింగ్ లో స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్న తర్వాత ఆ రంగానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించడంతో పాటూ సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. అయితే అనసూయ కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్, ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంటారు.
ఫ్యాన్స్ తో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే అనసూయ రీసెంట్ గా ఫ్యాన్స్ తో కలిసి ఓ మీటింగ్ లో పాల్గొని అక్కడ తనకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. అందులో భాగంగానే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అనసూయ ఎమోషనల్ అయ్యారు. గతంలో తన కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు అనసూయ తెలిపారు.
అందులో భాగంగానే జీవితమంటేనే సమస్యల ప్రయాణమని, లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ సమస్యలుంటాయని, ఒక్కొక్కరికి ఒక్కో ప్రయాణముంటుందని, ప్రస్తుతానికి తాను లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నానని, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలుగుతున్నానని, ఏం కావాలంటే అవి కొనుక్కోగలుగుతున్నానని, టీమ్ వర్క్ వల్ల కారు, ఇల్లు కొనుక్కోగలిగానని చెప్పిన అనసూయ ఆ టీమ్ లో తన ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నారు.
కుటుంబ సభ్యుల మోసం వల్ల తన తండ్రి అప్పట్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చిందని అనసూయ చెప్పారు. హైదరాబాద్ రేస్ క్లబ్ లో ట్రైనర్ గా వర్క్ చేసే తన తండ్రికి 12 గుర్రాలుండేవని, ఆ రేస్ వల్ల తమ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడిందని, ఏ రోజెలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, లైఫ్ లో స్థిరత్వం చాలా ముఖ్యమని, కానీ తన తండ్రి అది అర్థం చేసుకోలేకపోయారని అనసూయ చెప్పారు.
తమ తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలే కావడంతో అబ్బాయి పుట్టలేదనే బాధ తన తండ్రిలో ఉండేదని, ఒక్క వారసుడైనా ఉంటే బావుండేదని కోరుకునేవారని చెప్పారు. తన తండ్రి చాలా అందంగా ఉండేవారని చెప్పిన అనసూయ, ఆయన అందమే తనకు వచ్చిందని భావిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి నిబద్ధత నేర్చుకున్నానని చెప్పిన అనసూయ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. పెళ్లి చేసుకున్న తర్వాతే తన లైఫ్ లో అసలైన టర్నింగ్ పాయింట్ మొదలైందని తన భర్త ప్రతీ విషయంలో తనకు తోడుగా ఉంటున్నట్టు చెప్పారు.
