Begin typing your search above and press return to search.

అనసూయ... మోడర్న్ డిజైన్స్‌లో స్టన్నింగ్ గ్లామర్!

పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వేసిన కొన్ని పోజులు మరో లెవెల్‌లో ఉండగా, అవుట్‌డోర్ ఫొటోలు మరింత నాచురల్‌గా అనిపించాయి.

By:  Tupaki Desk   |   21 Jun 2025 1:28 PM IST
అనసూయ... మోడర్న్ డిజైన్స్‌లో స్టన్నింగ్ గ్లామర్!
X

టాలీవుడ్‌లో యాంకర్‌గా, నటిగా బలమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె పర్పుల్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో డిజైనర్ అవుట్‌ఫిట్ ధరించి ఇచ్చిన ఫొటోషూట్ పోజులు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయి. ఈ అందమైన కలర్ కాంబినేషన్‌లోని డ్రెస్, ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అనసూయలోని ఫ్యాషన్ ఫ్లేర్‌ను మరోసారి నిరూపించాయి.

ఈ ఫొటోలలో అనసూయ ధరించిన డిజైనర్ చోలీ, అలాగే లైట్ యెల్లో ఫ్లోయింగ్ స్కర్ట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వేసిన కొన్ని పోజులు మరో లెవెల్‌లో ఉండగా, అవుట్‌డోర్ ఫొటోలు మరింత నాచురల్‌గా అనిపించాయి. స్పష్టంగా చెప్పాలి అంటే... ఈ లుక్‌లో అనసూయ ఫ్యాషన్ ఐకాన్‌లా మెరిసిపోయారు.

అనసూయ కెరీర్‌ విషయానికి వస్తే, ‘జబర్దస్త్’ షో ద్వారా మాస్ అభిమానులకు దగ్గరైంది. ఆ తరువాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాల్లో నటిగా తన వేరియేషన్ చూపించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె నటనకు గల డెఫినిషన్ ఒక్కటే... ఎంత మైనస్ రోల్ అయినా, ఎంత బోల్డ్ క్యారెక్టర్ అయినా న్యాయం చేస్తుంది. ఇటీవల ఆమె ఓటీటీ ప్రాజెక్ట్స్‌లోనూ యాక్టివ్‌గా మారింది.

సినిమాలకే కాకుండా అనసూయ ఫ్యాషన్ గేమ్‌లోనూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది. ప్రతి ఫొటోషూట్‌లోనూ ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తూ, తన వయస్సు మీద కాదు తన స్టైల్ మీద దృష్టి పెట్టే తత్వం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ట్రెండీ లుక్‌లతో పాటు ట్రెడిషనల్ డ్రెస్‌ల్లోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.