Begin typing your search above and press return to search.

శ్రీరామ సంజీవనిలో అడుగు పెట్టిన అనసూయ

అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో పాటు, తన పిల్లలు, భర్త, బంధుమిత్రులు ఉన్న ఫోటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

By:  Tupaki Desk   |   13 May 2025 7:42 PM IST
శ్రీరామ సంజీవనిలో అడుగు పెట్టిన అనసూయ
X

బుల్లి తెర ద్వారా న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అనసూయ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా అనసూయ హీరోయిన్‌ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్స్ మాదిరిగా సోషల్ మీడియాలో అనసూయకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ ఉంది. సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినా కూడా కొన్ని కారణాల వల్ల మొదట్లో నో చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఐటెం సాంగ్స్ మొదలుకుని పలు విధాలుగా సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న అనసూయ కొత్త ఇంట్లో అడుగు పెట్టింది.

సెలబ్రిటీలు ఏం చేసినా చాలా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. తాజాగా యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి అనసూయ తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో పాటు, తన పిల్లలు, భర్త, బంధుమిత్రులు ఉన్న ఫోటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన కొత్త ఇంటి గృహ ప్రవేశం సందర్భంగా అనసూయ సాంప్రదాయకరమైన చీర కట్టులో కనిపించింది. అంతే కాకుండా ఆమె పిల్లలు, భర్త కూడా పక్కా హిందూ సాంప్రదాయం అనుసారంగా గృహ ప్రవేశంకు రెడీ కావడం చూసి నెటిజన్స్ ఫిదా అయ్యారు.

తన కొత్త ఇంటి గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె షేర్ చేసింది. అందులో భాగంగా తన ఇంటి పేరు శ్రీరామ సంజీవిని అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ సీతారామాంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తో మీ అందరి ప్రేమతో మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నామని అభిమానులతో పంచుకుంది. మీ అందరి ప్రేమ ఇలాగే కొనసాగలని కోరుకుంటూ అనసూయ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అనసూయ సోషల్‌ మీడియా పోస్ట్‌పై ప్రముఖులు సైతం స్పందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనసూయకు అందరి నుంచి మద్దతు లభించింది.

జబర్దస్త్‌ కార్యక్రమంలో ఫుల్‌ బిజీగా ఉన్న సమయంలోనే రామ్‌ చరణ్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా కెరీర్‌ టర్న్‌ అయింది. సినిమాల్లో పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి. దాంతో జబర్దస్త్‌ కార్యక్రమం వదిలేసి కొత్త జీవితంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో సినిమాల్లో ఎక్కువగా నటించడం మొదలు పెట్టింది. జబర్దస్త్‌ మానేసిన తర్వాత అనసూయకు ఎక్కువ సినిమా ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ముందు ముందు అనసూయ మరింత బిజీ కావడం ఖాయం అని, తప్పకుండా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అనసూయ కుమ్మేస్తుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు.