అనసూయ.. నడముతో వయ్యారాల సెగ
పైన వేసిన చోళీ పైన చిన్న చిన్న అద్దాలు, కట్లు వేస్తూ డిజైన్ చేసిన పద్ధతి, చీరని ఎగుర వేసిన ఫోటో పాజ్ అంతా చూసేవారికి ఒక కళాత్మక దృశ్యం లా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 10 May 2025 4:48 PM ISTఅనసూయ భరద్వాజ్.. ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా తనదైన గ్లామర్ తో సరికొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్, మల్టీ కలర్ లెహంగా-చోళీ ధరించి అనసూయ చేసిన ఈ ఫొటో షూట్ ఫ్యాన్స్‌ని పూర్తిగా ఆకట్టుకుంటోంది. బోల్డ్ అటిట్యూడ్, క్యూట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా కలసి ఈ ఫొటోలు స్పెషల్ గా నిలుస్తున్నాయి. రంగురంగుల దుస్తులు, పర్ఫెక్ట్ స్టైలింగ్ తో అనసూయ ఈ సారి మరీ అందంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోల్లో అనసూయ వేసిన మల్టీ కలర్ లెహంగా దుస్తులు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. పైన వేసిన చోళీ పైన చిన్న చిన్న అద్దాలు, కట్లు వేస్తూ డిజైన్ చేసిన పద్ధతి, చీరని ఎగుర వేసిన ఫోటో పాజ్ అంతా చూసేవారికి ఒక కళాత్మక దృశ్యం లా కనిపిస్తోంది. ఈ లుక్‌లో అనసూయ స్టైల్, కాన్ఫిడెన్స్ రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలు చూసి కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘అనసూయ గారూ.. మీరు వెన్నెలకంటే అందంగా ఉన్నారు’, ‘ఒక్క చూపుతో గుండెల్లో తుఫాను’ అంటూ ఫ్యాన్స్ రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. అనసూయ ఈ మధ్యకాలంలో తన లుక్‌లతో, ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో ఎక్కువగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అనసూయ కెరీర్ విషయానికి వస్తే, యాంకరింగ్ నుంచి సినిమాల వరకు తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ‘జబర్దస్త్’ షోతో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్‌లలో తన నటనతో కితాబు అందుకుంది. పుష్ప సినిమాలోని దాక్షాయిణి పాత్ర అయితే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా అనసూయ వెబ్ సిరీస్‌లలోనూ బిజీ అవుతోంది. అలాగే అనసూయ మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అలాగే ఒక నటిగా మాత్రమే కాకుండా యాంకర్, మోడల్, వెబ్ సిరీస్ ఆర్టిస్ట్ ఇలా విభిన్న వేదికల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తోంది.
