Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : బికినీలో అందాల లైగర్‌

స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్ 2 తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య పాండే.

By:  Tupaki Desk   |   14 May 2024 10:37 AM GMT
పిక్‌ టాక్‌ : బికినీలో అందాల లైగర్‌
X

స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్ 2 తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనన్య పాండే. స్టార్ కిడ్ అయినా కూడా అనన్య పాండే ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు, ఆ తర్వాత సక్సెస్ లు దక్కించుకునేందుకు చాలానే కష్టపడింది, ఇంకా కష్టపడుతూనే ఉంది.


స్టార్‌ కిడ్‌ అయినంత మాత్రాన ఈజీగా ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు ఏమీ రాలేదు. అందాల విందు ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు నటనలో తనను తాను నిరూపించుకుంటూ ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుంది అంటూ ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.


తెలుగు లో విజయ్ దేవరకొండకి జోడీగా లైగర్ సినిమాలో ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఈ అమ్మడి కెరీర్‌ కాస్త స్లో అయ్యింది. అయితే బాలీవుడ్‌ లో మళ్లీ ఈ అమ్మడు బిజీ అయినట్లుగా కనిపిస్తుంది.


సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. సన్నని ఫిజిక్ తో ఈ అమ్మడు చేస్తున్న అందాల షోకి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అని మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయ్యింది.

తన మొబైల్‌ లో షేర్ చేయకుండా మిస్ అయ్యి ఉన్న ఈ ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటూ అనన్య పాండే ఈ ఫోటోలను షేర్‌ చేసింది. బికినీలో ఈ లైగర్ బ్యూటీని చూస్తూ ఎంతటి వారికి అయినా గుండె జారి గల్లంతు అవ్వాల్సిందే అనడంలో సందేహం లేదు.