Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లైగర్ బ్యూటీ చిల్‌ మూడ్‌ ఫోజ్‌

టాలీవుడ్‌ లో విజయ్‌ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటించింది. లైగర్‌ సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది

By:  Tupaki Desk   |   7 Jun 2024 2:48 PM GMT
పిక్ టాక్ : లైగర్ బ్యూటీ చిల్‌ మూడ్‌ ఫోజ్‌
X

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే బాలీవుడ్‌ లో స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌ లో విజయ్‌ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటించింది. లైగర్‌ సినిమా నిరాశ పరచడంతో బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది.

ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సాధారణంగా అనన్య పాండే రెగ్యులర్ గా స్కిన్‌ షో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి స్కిన్‌ షో చేయకుండా విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కాస్ట్యూమ్‌ లో కూడా భలే ఉందే అంటూ నెటిజన్స్ అనన్య పాండే షేర్ చేసిన ఈ పిక్స్ గురించి మాట్లాడుతున్నారు. చిల్ మూడ్ లో ఉన్నట్లుగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఆకట్టుకుంది.

లైట్ పింక్ కలర్ డ్రెస్ లో అందాల అనన్య పాండేను చూడటం బాగుంది అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో అనన్య పాండే గత ఫోటోల మాదిరిగానే ఈ ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌ లో మళ్లీ ఈ అమ్మడు సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. స్టార్‌ హీరోలకు ముందు ముందు ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యే అవకాశాలు లేక పోలేదు అన్నట్లుగా కూడా కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.