Begin typing your search above and press return to search.

ఆత్మ‌ను కోల్పోయాను! బ్రేక‌ప్‌పై అన‌న్య‌ ఆవేద‌న‌!!

'లైగ‌ర్' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. తొలి పరిచ‌యం బావున్నా సినిమా ఆడ‌లేదు

By:  Tupaki Desk   |   30 May 2024 4:00 AM GMT
ఆత్మ‌ను కోల్పోయాను! బ్రేక‌ప్‌పై అన‌న్య‌ ఆవేద‌న‌!!
X

'లైగ‌ర్' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. తొలి పరిచ‌యం బావున్నా సినిమా ఆడ‌లేదు. అన‌న్య అంద‌చందాల‌కు మంచి గుర్తింపు ల‌భించినా కానీ కాలం క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. అయితే సినిమాలో కంటే ప్రియుడితో షికార్ల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు బ్రేక‌ప్ వార్త‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ విడిపోయారనే పుకార్లు గత కొంతకాలంగా హెడ్ లైన్స్ గా మారాయి. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట విడిపోయినట్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ ఎడబాటు గురించి ఆదిత్య కానీ, అనన్య కానీ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ అనన్య తాజా ప్రకటన త‌న‌లోని ఆవేద‌న‌ను బ‌య‌ట‌పెట్టింది. తాను తన ఆత్మను కోల్పోయాన‌ని అన‌న్య నిరాశ చెంద‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఓర్రీ (ఓర్హాన్ అవత్రామణి) తన స్నేహితులందరినీ ఈ సాయంత్రం వారు కోల్పోయినది ఏమిటో ప్రశ్నించే వీడియోను షేర్ చేయ‌డం .. దానికి అనన్య ''నేను నా ఆత్మను కోల్పోయాను'' అని స‌మాధానం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది అన‌న్య‌ మానసిక స్థితిని వ్యక్తపరుస్తోందని చాలా మంది భావిస్తున్నారు.

గ‌డిచిన రెండోళ్ల‌లో ఈ జంట అన్యోన్య‌త అనురాగాలు రొమాంటిక్ డేట్లు ప్ర‌తిదీ అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. విదేశీ వెకేష‌న్ల‌లో జంట గోల్స్ ని నిర్ధేశించ‌డంలో ఎల్ల‌పుడూ అనన్య‌-ఆదిత్య త‌ర్వాతే అంటూ అభిమానులు మురిసోయారు. కానీ ఇప్పుడు బ్రేక‌ప్ త‌ర్వాత‌ ఈ ఎడ‌బాటును త‌ట్టుకోలేని ప‌రిస్థితిలో ఉంది ఈ జంట‌. క‌ర‌ణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ఆదిత్య పేరు చెప్ప‌గానే అన‌న్య‌ సిగ్గుల మొగ్గ‌యింది. ఆదిత్య‌ను వివాహం చేసుకున్న తర్వాత త‌న ఇంటిపేరు మారుతుంద‌ని కూడా అన‌న్య పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల‌తో త‌మ మ‌ధ్య అనుబంధం పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చింద‌ని అంతా భావించారు.

అయితే ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. ఆదిత్య నుంచి విడిపోవాల్సిన ప‌రిస్థితి. అయినప్పటికీ అనన్య పాండే కొంత‌ ఉత్సాహంతో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫోటోలను షేర్ చేస్తోంది. ప్ర‌స్తుతం వృత్తిపరమైన క‌మిట్ మెంట్ల‌పైనే ఫోక‌స్ చేస్తున్నాన‌ని కూడా చెప్పింది. అంతేకాదు అన‌న్య‌- ఆదిత్య ఇద్దరూ ఇటీవల ఒక కొత్త ప్రకటనలో కలిసి కనిపించారు. ఇప్ప‌టి బ్రేక‌ప్ పరిస్థితిని సామరస్యంగా మేనేజ్ చేస్తున్నామ‌ని కూడా సూచిస్తున్నారు. కానీ అన‌న్య తాజా కామెంట్ ఆశ్చర్య‌ప‌రుస్తోంది. త‌న హృద‌యానికి అయిన గాయాన్ని మాన్ప‌లేక‌పోతోంద‌ని స్ప‌ష్ఠ‌మవుతోంది.

అనన్య పాండే తన జీవితాన్ని ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా ర‌హ‌స్యంగా దాచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని ఇంత‌కుముందు ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. సంబంధంలో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌యివేట్ గా ఉండాల‌ని అనుకుంటాను. మ‌న‌తో ఉన్న వ్యక్తి కొన్నిసార్లు ఆ విషయాలను బయట పెట్టడం అన్యాయంగా అనిపించదు అని కూడా త‌న మ‌న‌సును బ‌య‌ట‌పెట్టింది. త‌న ల‌వ్ లైఫ్ గురించి చాలా ర‌హ‌స్యంగా ఉంచినా కానీ, క‌ర‌ణ్ షోలో ఏదీ దాచుకోలేక‌పోయింది. కానీ ఇప్పుడు బ్రేక‌ప్ త‌న హృద‌యాన్ని గాయ‌ప‌రిచింద‌ని తాజా కామెంట్ రివీల్ చేస్తోంది.

అనన్య పాండే తన మొట్టమొదటి వెబ్ సిరీస్ కాల్ మీ బే విడుదలకు సిద్ధంగా ఉంది. షారూఖ్ వార‌సుడు ఆర్యన్ ఖాన్ రూపొందిస్తున్న 'స్టార్‌డమ్‌'లో ప్రత్యేక అతిధి పాత్రలో కూడా కనిపిస్తుంది.