Begin typing your search above and press return to search.

ప్రేమ పుకార్లపై 'లైగర్‌' బ్యూటీ స్పందన

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – 2 సినిమా తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే

By:  Tupaki Desk   |   24 Jan 2024 12:30 AM GMT
ప్రేమ పుకార్లపై లైగర్‌ బ్యూటీ స్పందన
X

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – 2 సినిమా తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు తెలుగు లో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో సౌత్ లో మళ్లీ అమ్మడు కనిపించలేదు.

హిందీలో మాత్రం కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉంది. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడు బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ ఆదిత్య రాయ్ కపూర్‌ తో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు మరియు వీడియోలు కూడా వైరల్‌ అవ్వడం ఈ మధ్య కాలంలో కామన్‌ అయ్యింది.

ఇటీవల వీరిద్దరు ఒక పార్టీలో కలిసి ఉన్న ఫోటోలు మరియు కలిసి ఐస్ స్కేటింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఇదే సాక్ష్యం అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా మరియు మీడియాలో హడావుడి చేస్తున్నారు.

మీడియాలో వస్తున్న వార్తలపై సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంపై అనన్య పాండే స్పందించింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం నాకు బాధను కలిగించలేదు. ఇద్దరం కూడా నటులం. మేము పలు సందర్భాల్లో కెమెరా ముందు యాక్ట్‌ చేశాం. ఏదో ఒక సమయంలో ఇలాంటివి జరుగుతాయి, ప్రచారం జరుగుతుందని నేను భావించాను అంటూ అనన్య చెప్పుకొచ్చింది.

మొత్తానికి మరోసారి తాను ఆదిత్య కపూర్‌ తో ప్రేమలో లేను అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాత్రం అనధికారికంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఏదో ఒక సమయంలో వీరిద్దరు తమ ప్రేమను బాహాటంగా ప్రకటిస్తారేమో చూడాలి.