Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అవార్డ్‌ వేడుకలో అందాల లైగర్‌

లైగర్ బ్యూటీ అనన్య పాండే ఆకట్టుకునే అందం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

By:  Tupaki Desk   |   13 March 2024 12:30 AM GMT
పిక్ టాక్‌ : అవార్డ్‌ వేడుకలో అందాల లైగర్‌
X

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో సౌత్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు తెలుగు లో నటించిన మొదటి సినిమానే కమర్షియల్‌ గా నిరాశ పరచడంతో ఆ తర్వాత మళ్లీ సినిమాను చేయలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది.


లైగర్ బ్యూటీ అనన్య పాండే ఆకట్టుకునే అందం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఒక అవార్డ్‌ వేడుకలో ఈ అమ్మడు సందడి చేసింది.

తాజా అవార్డ్‌ వేడుకలో డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ లో మెరిసిన అనన్య పాండే ఎప్పటిలాగే అవార్డు వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి స్టైలిష్ లుక్ లో అనన్య పాండే కనిపించి మెప్పించింది. ఆ అవార్డు వేడుకలో ఈ అమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే... రెండు సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది మూడు సినిమాల్లో నటించిన అనన్య పాండే ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయ్యి వాటిని చేస్తుంది. ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.