Begin typing your search above and press return to search.

నాయికల బంధంపై లైగర్ బ్యూటీ కామెంట్..!

బాలీవుడ్ లో తక్కువ టైం లోనే అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనన్యా పాండే.

By:  Tupaki Desk   |   19 April 2024 4:44 AM GMT
నాయికల బంధంపై లైగర్ బ్యూటీ కామెంట్..!
X

బాలీవుడ్ లో తక్కువ టైం లోనే అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనన్యా పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో తెరంగేట్రం చేసిన అనన్యా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో ఆడియన్స్ ను అలరిస్తున్న అనన్యా పాండే సౌత్ ఆడియన్స్ ని మెప్పించేందుకు లైగర్ సినిమాతో వచ్చింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే సౌత్ సినీ ఆఫర్లను పక్కన పెట్టి బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుంది.

హీరోయిన్ గా ఒక మోస్తారుగా కెరీర్ ను కొనసాగిస్తున్న అనన్యా పాండే తన మనసులో ఉన్న మాటను చెప్పడంలో ఎలాంటి మొహమాటం చూపించదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కథనాయికల మధ్య స్నేహం గురించి పెద్ద క్లాసే తీసుకుంది అనన్యా. కథానాయికల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని. బయట నుంచి చూసే మీకు ఇదంతా ఏమి కనిపించదని అంటుంది అనన్యా పాండే.

ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అందులో భాగంగానే తనకు దీపిక పదుకొనె, భూమి పడ్నేకర్ లాంటి వారితో నటించే అవకాశం దక్కిందని అంటుంది అనన్యా పాండే. అయితే బయట వారికి ఇవేవి కనిపించవు అందుకే వారు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తుంటారని చెప్పింది.

అయితే కథానాయికల మధ్య సాన్నిహిత్యం గురించి బయట వాళ్లకు తెలియదన్న అనన్యా హీరో హీరోయిన్ ఫ్రెండ్ షిప్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. హీరోయిన్స్ మధ్య ఏ రిలేషన్ వారు ఎంత క్లోజ్ అయినా అనవసరం కానీ ఒక హీరో హీరోయిన్ క్లోజ్ గా ఉంటే మాత్రం వాళ్లని హైలెట్ చేయడం మీడియాకు అలవాటే. అయితే అనన్యా కేవలం నాయికల మధ్య స్నేహం గురించి చెప్పింది కానీ అదే హీరోలతో హీరోయిన్స్ ఉన్న కాస్త క్లోజ్ నెస్ ని బయట వాళ్లు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో ప్రస్తావించలేదు. ఎందుకంటే అక్కడ ఏమి లేకపోయినా ఏదో జరుగుతుందని హడావిడి చేస్తారని అనన్యాకి తెలుసు కాబట్టే. మొత్తానికి అనన్యా పాండే హీరోయిన్స్ మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉంటుందో తన మాటల్లో వెల్లడించింది.

లైగర్ హిట్ పడితే సౌత్ నుంచి మరికొన్ని ఆఫర్లు వచ్చేవి కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అనన్యాకు టాలీవుడ్ నుంచి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది అనన్యా పాండే.