Begin typing your search above and press return to search.

లైగ‌ర్ బ్యూటీతో హీరో దోబూచులాట‌.. దొరికేశాడుగా!

అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ ముంబైలో ఒకరితో ఒకరు 'రొమాంటిక్ మూవీ డేట్‌'ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు

By:  Tupaki Desk   |   2 Aug 2023 2:09 PM GMT
లైగ‌ర్ బ్యూటీతో హీరో దోబూచులాట‌.. దొరికేశాడుగా!
X

అనన్య పాండే - ఆదిత్యరాయ్ కపూర్ బాలీవుడ్‌లో ట్రెండీ పెయిర్. ఈ ఇద్దరూ కలిసి వెకేష‌న్ లో ప్ర‌త్య‌క్షం కాగానే.. రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఈ అంద‌మైన జంట ఒక‌రికోసం ఒక‌రు జాలీగా సమయాన్ని గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోర్చుగల్‌కు విహారయాత్రకు వెళ్లార‌ని పుకార్లు షికార్ చేసాయి. ఎట్ట‌కేల‌కు ఈ ప్ర‌చారంపై ఆదిత్య చోప్రా స్పందించాడు.

తాజాగా హిందుస్థాన్ టైమ్స్‌కి ఇటీవల ఇంటర్వ్యూలో.. తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాన‌ని అత‌డు తెలిపాడు. ''నేను సోషల్ మీడియాలో ఎక్కువగా లేకపోవడం మంచి విషయం. కానీ మాపై సాగుతున్న ప్ర‌చారం గురించి నేను విన్నాను'' అని ఆదిత్య‌ అన్నాడు. ''నాకు క‌చ్చితంగా విరామం కావాలి. నేను రుతుపవనాలను మిస్స‌వుతున్నాను. అయితే ముంబైలో వ‌ర్షాల‌ను అమితంగా ప్రేమిస్తాను. నేను తిరిగి వచ్చిన క్షణం నుండి ఒక వారం పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది'' అన్నారాయన.

గత వారంలోనే అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ ముంబైలో ఒకరితో ఒకరు 'రొమాంటిక్ మూవీ డేట్‌'ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ జంట 'బార్బీ' సినిమా చూడటానికి వెళ్ళారు. అదే స‌మ‌యంలో కెమెరా కంటికి చిక్కారు.

ఇద్దరూ కలిసి ఉన్న‌ ఫోటోల‌ను తీసేందుకు కెమెరామెన్లు పోటీప‌డ్డారు. అన‌న్య‌- ఆదిత్య క‌పూర్ జోడీ గత సంవత్సరం కృతి సనన్ దీపావళి పార్టీకి కూడా హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కోసం లాక్మే ఫ్యాషన్ వీక్ షోలోను సంద‌డి చేసారు.

ఆదిత్య రాయ్ కపూర్ ప్ర‌స్తుతం 'మెట్రో ఇన్ డినో'లో న‌టిస్తున్నారు. ఇందులో సారా అలీ ఖాన్ క‌థానాయిక‌. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, అలీ ఫజల్ కూడా నటిస్తున్నారు. 2024లో పెద్ద తెరపైకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అనన్య పాండే 'డ్రీమ్ గర్ల్-2' లో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. ఈ చిత్రం ఆగస్టు 25 న థియేట‌ర్ల‌లో విడుదల అవుతుంది.