Begin typing your search above and press return to search.

ధూమ్ కోసం తెగించేస్తానంటోన్న హీరోయిన్!

'ధూమ్' సిరిస్ లో ఛాన్స్ కోసం ఎంత మంది హీరోయిన్లు పోటీ ప‌డుతున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   15 Jan 2024 2:45 AM GMT
ధూమ్ కోసం తెగించేస్తానంటోన్న హీరోయిన్!
X

'ధూమ్' సిరిస్ లో ఛాన్స్ కోసం ఎంత మంది హీరోయిన్లు పోటీ ప‌డుతున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ హీరోయిన్ల ద‌గ్గ‌ర నుంచి యువ నాయిక‌ల వ‌ర‌కూ అంతా ధూమ్ లో ఛాన్స్ కోసం క్యూలో ఉన్నారు. 'ధూమ్' ప్రాంచైజీ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మార‌డంతోనే ఆ రేంజ్ లో క్రేజ్ ఏర్ప‌డింది. ఇషా డియో ల్..రిమిసేన్.. ఐశ్య‌ర్యారాయ్..బిపాసా బ‌సు.. క‌త్రినా కైఫ్ లాంటి వారి కెరీర్ లో ధూమ్ ప్ర‌త్యేక ప్రాంచైజీగా నిల‌వ‌డంతోనే ఈ ర‌క‌మైన బ‌జ్ క్రియేట్ అయింది.

అలాంటి యాక్షన్ ప్రాంచైజీ ఒక‌టి చేస్తే చాలు పాన్ ఇండియాలో విప‌రీత‌మైన క్రేజ్ కి ఛాన్స్ ఉంటుంది. పైగా ఆ సిరిస్ లో న‌టించే హీరోలంతా కూడా సూప‌ర్ స్టార్లే. జాన్ అబ్ర‌హం...హృతిక్ రోష‌న్...అభిషేక్ బ‌చ్చ‌న్.. అమీర్ ఖాన్ లాంటి సూప‌ర్ హీరోలు న‌టించ‌డంతో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ రేంజ్ ఉన్న హీరోతో ఒక్క సినిమా చేసిన నాలు అనుకున్న భామ‌లెంతో మంది. ప్ర‌స్తుతం ధూమ్-4 కి సంబంధించి యాష్ రాజ్ ఫిల్మ్స్ స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వ వ‌హించేది ఎవ‌రు? హీరో ఎవ‌రు? విల‌న్ ఎవ‌రు? ఎప్పుడు ప్రారంభం అవుతుంది వంటి ఏ క్లారిటీ లేక‌పోయినా క్యూలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్ల‌లో నేను ఉన్నానంటూ ముందుకొచ్చింది యువ నాయిక అన‌న్యా పాండే. ధూమ్ సినిమా అంటే త‌న‌కెంత ఇష్ట‌మో రివీల్ చేసింది. ఆ సిరీస్ లో న‌టించే ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోన‌ని...ఎలాంటి సాహ‌సాల‌కైనా తెగిస్తాన‌ని చెప్పింది.

అలాంటి సినిమా కోసం ఎంత చేసినా త‌క్కువే అవుతుంది..అది కేవ‌లం 'దూమ్' కి మాత్ర‌మే సాధ్య‌మ వుతుంద‌ని అంది. మ‌రి ఈ ఛాన్స్ ఎవ‌రికి వ‌రిస్తుంది? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే దీపికా ప‌దుకొణే పేరు ప్ర‌ధానంగా వినిపిస్తుంది. ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత ఆ రేంజ్ ఉన్న హీరోయిన్ ఎవ‌రు? ఈసిరీస్ లో న‌టించ‌ని సీనియ‌ర్ భామ ఎవ‌రైనా మిగిలారా? అంటే దీపిక పేరు చెప్పొచ్చు. ఆ సిరీస్ అన్ని ర‌కాలుగానూ దీపిక అర్హురాలు.