Begin typing your search above and press return to search.

బాడీ షేమింగ్ అంటే? బెంబేలెత్తిపోతున్న కుర్ర భామ‌!

సెల‌బ్రిటీల‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఓ కామ‌న్ గా మారిన అంశం. అందులోనూ హీరోయిన్లు ప్ర‌త్యేకంగా టార్గెట్ అవుతుంటారు

By:  Tupaki Desk   |   23 Nov 2023 10:30 AM GMT
బాడీ షేమింగ్ అంటే? బెంబేలెత్తిపోతున్న కుర్ర భామ‌!
X

సెల‌బ్రిటీల‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఓ కామ‌న్ గా మారిన అంశం. అందులోనూ హీరోయిన్లు ప్ర‌త్యేకంగా టార్గెట్ అవుతుంటారు. భామ‌లంతా బాడీ షేమింగ్ విష‌యంలో ఎక్కువ‌గా ట్రోలింగ్ కి గుర‌వు తుంటారు. ర‌క‌ర‌కాల అంశాల్లో దొరికినా..బాడీ షేమింగ్ అన్న‌ది అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించిన అంశం కావ‌డంతో! ఈవిష‌యంపై హీరోయిన్లు ఏమాత్రం బెరుకు లేకుండా నెట్టింట్లో చ‌ర్చింస్తుంటారు.

తాజాగా యువ నాయిక అన‌న్యా పాండే కూడా త‌న మ‌నోవేద‌ని బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నంచేసింది. 'బాడీ షేమింగ్ నెగిటివిటీ వ‌ల్ల ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుంటున్నా. ఆ నెగిటివిటీ వ‌ల్ల ఇప్ప‌టికీ నా జీవితం ప‌ట్ల అభ‌ద్ర‌త‌గానే ఫీల్ అవుతుంటా. కొందరు నా గురించి చేసే ట్రోల్స్ ఎంతో బాధిస్తాయి. వాటికి దూరంగా ఒంటరిగా ఉండాల‌నుకుంటా. అలా ఉండి నా మ‌న‌సు చెప్పే మాట‌లు మాత్ర‌మే వింటాను.

సోష‌ల్ మీడియా ప్ర‌తీ ఒక్క‌రి జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. నా చిన్న‌త‌నంలో ఫోన్లు వినియోగం త‌క్కువ‌గా ఉండేది. ఇప్పుడు అంద‌రి చేతుల్లో ఫోన్లు క‌నిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్లు ఇబ్బంది క‌రంగా ఉంటాయి. ఇవి యువ‌త‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. అలాంటి వాటిని అన్ ఫాలో చేయ‌డం లేదా..మ్యూట్ చేయ‌డం చేస్తుంటా. ఈ మ‌ధ్య అలా ఉండ‌టం వ‌ల్ల చాలా ప్ర‌శాంత‌త ద‌క్కుతుంది.

ఒక్కోసారి ఫోన్ లేక‌పోతే బాగుండి అనిపిస్తుంది. కానీ జీవిత‌మంతా దానితోనే ముడి ప‌డి ఉంట‌డంతో వాడ‌క త‌ప్ప‌లేదు' అంటోంది. ఈ అమ్మ‌డు 'లైగ‌ర్' తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ లాంచింగ్ తో ఇక్క‌డ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాల‌నుకుంది. కానీ అమ్మ‌డి అంచ‌నాలు త‌ప్పాయి. ఒక్క ప్లాప్ ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో అక్క‌డికే పంపించింది. ఈ నేప‌థ్యంలో 'లైగ‌ర్' యూనిట్ పై ఆమధ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే కెరీర్ పోక‌స్ చేసింది. అలాగే వెబ్ సిరీస్ లు చేస్తోంది.