Begin typing your search above and press return to search.

వ్వావ్! లైగ‌ర్ బ్యూటీ కొత్త ఇంటి డిజైన‌ర్ ఎవ‌రో తెలుసా?

అనన్య పాండే ఇటీవలే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా సహకారంతో తన అద్భుతమైన ముంబై అపార్ట్‌మెంట్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 2:08 PM GMT
వ్వావ్! లైగ‌ర్ బ్యూటీ కొత్త ఇంటి డిజైన‌ర్ ఎవ‌రో తెలుసా?
X

లైగ‌ర్ చిత్రంతో సౌత్ కి ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీని పూరి అండ్ టీమ్ టాలీవుడ్ కి ర‌ప్పించారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ తొలి సినిమా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అయినా అన‌న్య కెరీర్‌కు వ‌చ్చిన డోఖా ఏం లేదు. ఇప్ప‌ట్లో సౌత్ జోలికి రాకుండా ప్ర‌స్తుతానికి హిందీ సినిమాల‌తో ముందుకు సాగుతోంది.

ఒక్కో సినిమాకి సుమారు 3-4 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ త‌న ఆర్జ‌న నుంచి కోట్లాది రూపాయ‌ల మొత్తాన్ని రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డిగా పెడుతోంది.

ఇప్పుడు అనన్య పాండే తన డ్రీమీ ముంబై అపార్ట్‌మెంట్‌ను ప్రారంభించింది. అనన్య పాండే ఇటీవలే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా సహకారంతో తన అద్భుతమైన ముంబై అపార్ట్‌మెంట్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

తన ప్రాజెక్ట్‌ల విజయాన్ని పురస్కరించుకుని అనన్య పాండే ఇటీవలే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా సహకారంతో తన అద్భుతమైన ముంబై అపార్ట్‌మెంట్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. ''ఇల్లు సరిగ్గా అలా ఉండాలని మేం ఊహించుకున్నాం. ఇది నా వ్యక్తిత్వానికి పొడిగింపు'' అని అన‌న్య పేర్కొంది.

అపార్ట్‌మెంట్ లుక్, ఇంటీరియ‌ర్ ఎంపిక ఎంతో డీసెంట్ గా ఆక‌ట్టుకుంటోంది. ప్రధాన కారిడార్ పింక్ రంగుతో డిజైన్ చేసిన‌ది. పడకగదిలో గోడలు ప్ర‌త్యేకంగా డిజైన్ అయ్యాయి. బేబీ బ్లూ షెల్ఫ్‌లు తెలుపు కౌంటర్‌టాప్‌లతో కూడిన చిన్న కానీ బాగా అమర్చిన‌ వంటగది కారిడార్ తో ఆక‌ట్టుకుంటుంది.

ఈ ఇంటికి డిజైన‌ర్ ది గ్రేట్ గౌరీఖాన్. అనన్య పాండే, గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మధ్య ఉన్న స్నేహం ప్రాజెక్ట్‌కు వ్యక్తిగత ట‌చ్ ని జోడించింది. అన‌న్య త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల వివ‌రాల్లోకి వెళితే.. కంట్రోల్, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్ చిత్రీకరణల‌తో అన‌న్య‌ బిజీగా ఉంది.