Begin typing your search above and press return to search.

లైగర్‌ బ్యూటీ వాలంటైన్‌ స్పెషల్‌ క్యూట్‌ పిక్‌

బాలీవుడ్‌ స్టార్ కిడ్ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు లైగర్‌ సినిమాతో పరిచయం అయ్యింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:17 AM GMT
లైగర్‌ బ్యూటీ వాలంటైన్‌ స్పెషల్‌ క్యూట్‌ పిక్‌
X

బాలీవుడ్‌ స్టార్ కిడ్ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు లైగర్‌ సినిమాతో పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా అనన్య పాండే కు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు దక్కుతున్నట్లుగా సమాచారం అందుతోంది.


హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను దక్కించుకుంది. తాజాగా వాలంటైన్ డే సందర్భంగా ఈ క్యూట్‌ పిక్ ను షేర్‌ చేసింది.

వైట్ డ్రెస్ పై లవ్‌ సింబల్స్ తో అనన్య పాండే సింపుల్‌ అండ్ స్వీట్ గా ఉంది. చేతిలో పూల బొకే ను పట్టుకుని ఉన్న ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్‌ చేసింది. ఈ ప్రత్యేకమైన రోజు తనకు ఎంతో ఇష్టం అన్నట్లుగా ఎక్స్ ద్వారా పేర్కొంది.

అనన్య పాండే ఎక్స్ లో... ఐ లవ్‌ ది డే ఆఫ్‌ లవ్‌... ప్రతి ఒక్కరికి వాలంటైన్‌ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో మరియు అనన్య పాండే కామెంట్ వైరల్‌ అవుతోంది. గత కొంత కాలంగా ఈ అమ్మడు ఆధిత్య రాయ్ కపూర్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ లు తమ ప్రేమ వ్యవహారం ను తాజా వాలంటైన్స్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరు ఆ విషయాన్ని ఇంకా అనధికారికంగానే ఉంచారు. వచ్చే ప్రత్యేక రోజు వరకు అయినా అఫిషియల్‌ అయ్యేనా చూడాలి.