Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి కాక పుట్టించే హాట్ కామెంట్!

ఇలాంటి ఫొటోలను షేర్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. సినీ ఫీల్డ్ లో ఉండాలంటే అన్ని రకాలుగా క‌నిపించాలి.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:44 AM GMT
తెలుగ‌మ్మాయి కాక పుట్టించే హాట్ కామెంట్!
X

తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల కెరీర్ సోసోగా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు స‌రైన అవ‌కాశం కోసం ఎదురు చూస్తోంది గానీ..ఆ ఛాన్స్ రావ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం కెరీర్ లో పెద్ద సినిమా ఏదైనా ఉంది? అంటే అది వ‌కీల సాబ్ మాత్ర‌మే. ఆ త‌ర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్సు రాలేదు. అయితే వాటిక‌న్నా మ‌ల్లేశం లాంటి సినిమానే అమ్మ‌డికి ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చింద‌నొచ్చు. ప్ర‌స్తుతం అన్వేషి అనే సినిమాలో చిత్రంలో న‌టిస్తోంది.

ఇది మిన‌హా కొత్త ఛాన్సు ఏది చేతిలో లేదు. ఇక అన‌న్య ఇన్ స్టా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమా క్రేజ్ తో ప‌నిలేకుండా ఇన్ స్టాలో అమ్మ‌డు బాగానే దూసుకుపోతుంది. గ్లామ‌ర్ ఫోటోల‌తో అమ్మ‌డి అందాల విందు చేస్తుంది. యువ‌త అటెన్ష‌న్ డ్రా చేసేలా అన్ని ర‌కాల ఫోజుల‌తోనూ ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇటీవ‌లే మ‌రికొన్ని ఫోటోల్ని కూడా షేర్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఆ విష‌యాల్ని అమ్మ‌డు మీడియాతో పంచుకుంది.

'శాకుంతలం' లో నటించేటప్పుడు కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేశాను. ఆ ఫొటోలకే చాలా రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి ఫొటోలను షేర్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. సినీ ఫీల్డ్ లో ఉండాలంటే అన్ని రకాలుగా క‌నిపించాలి. అందుకే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్నాను. నాకు కొన్ని కమర్షియల్ అవకాశాలు వచ్చినప్పటికీ అవి వర్కవుట్ కాక‌పోవ‌డంతో న‌టించ‌లేదు' అని అంది.

2023 లో తెలుగ‌మ్మాయిల ఉనికి బాగా పెరిని సంగ‌తి తెలిసిందే. కొత్త వాళ్ల‌ని ఇండ‌స్ట్రీలో కొంత మంది బాగానే ప్రోత్స‌హిస్తున్న స‌న్నివేశం క‌నిపిస్తుంది. గ‌తం కంటే ఇప్పుడు ప‌రిస్థితి మెరుగ్గా ఉంది. ఇదే తెలుగు అమ్మాయిల‌కు భ‌రోసాగా క‌నిపిస్తుంది. యూ ట్యూబ్ వీడియోల ద్వారా పాపుల‌ర్ అయిన వాళ్ల‌కు ఏకంగా హీరోయిన్ అవ‌కాశాలే క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అన‌న్య లాంటి అనుభ‌వం గ‌ల‌వారికి కొత్త అవ‌కాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.