Begin typing your search above and press return to search.

'లైగ‌ర్' బ్యూటీ ప్రేమలో ప‌డింది ఇత‌డితోనే!

ఇక్క‌డ‌ ఆహారం సూర్యరశ్మి ఉన్నాయి.. అన్నివైపులా ప్రేమ, మంచి వైబ్స్ కి ధన్యవాదాలు. నా పుట్టినరోజుకు ముందు రోజు నేను మూడు ఇంద్రధనస్సులను చూశాను.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:15 PM GMT
లైగ‌ర్ బ్యూటీ ప్రేమలో ప‌డింది ఇత‌డితోనే!
X

లైగ‌ర్ చిత్రంతో సౌత్ కి ప‌రిచ‌య‌మైంది అనన్య పాండే. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో, అటుపై కేవ‌లం బాలీవుడ్ కెరీర్ పైనే ఫోక‌స్ చేసింది. మ‌రోవైపు హిందీ యువ‌హీరో ఆదిత్య రాయ్ క‌పూర్ తో నిండా ప్రేమ‌లో మునిగి ఉంద‌ని, అందుకే త‌క్కువ సినిమాలు చేస్తోంద‌ని ఈ భామ‌పై పుకార్లు షికార్ చేస్తున్నాయి. ప‌లుమార్లు ఈ ఇద్ద‌రూ జంట‌గా క‌నిపించిన ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూ బాలీవుడ్ మీడియా వేడెక్కించే క‌థ‌నాల‌ను వండి వార్చింది.


ఇటీవ‌లే ఆదిత్య రాయ్ క‌పూర్ - అన‌న్య జంట షికార్ కి సంబంధించిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. దానిపై ర‌క‌ర‌కాల కామెంట్లు చేసారు. ఇప్పుడు మాల్దీవుల రిసార్ట్‌లో 25వ పుట్టినరోజును జరుపుకుంటున్న అన‌న్య పాండే తో సీక్రెట్ ఫ్రెండ్ ఎవ‌రో ఉన్నారంటూ క‌థ‌నాలొస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అన‌న్య ఈ వేడుకకు సంబంధించిన‌ ఫోటోలను షేర్ చేసారు. ఎన‌ర్జిటిక్ మాక్సీ దుస్తుల్లో ఈ బ్యూటీ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. అక్క‌డ టేబుల్ పై ఉన్న‌ రుచికరమైన ఆహారం తిన‌డంలో క్యూట్ బ్యూటీ బిజీగా ఉంది. సముద్రం న‌డి ఒడ్డున ఉన్న ఓపెన్ థియేటర్‌లో ఈ భామ‌ సినిమా చూసింది. మాల్దీవుల పర్యటనలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ప్రత్యక్ష సంగీతాన్ని ఆస్వాధించింద‌ని కూడా హిందీ మీడియా క‌థ‌నాలు రాసింది.


బర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫోటోల బంచ్‌ను షేర్ చేస్తూ అనన్య ఇలా రాసింది.. 25!!!!! చాలా కృతజ్ఞతతో.. ఇక్క‌డ‌ ఆహారం సూర్యరశ్మి ఉన్నాయి.. అన్నివైపులా ప్రేమ, మంచి వైబ్స్ కి ధన్యవాదాలు. నా పుట్టినరోజుకు ముందు రోజు నేను మూడు ఇంద్రధనస్సులను చూశాను. ఇది ఒక సంకేతం (సూర్యుడు ఇంద్రధనస్సు ఎమోజీలు .. వేళ్లు క్రాస్డ్ ఎమోజీలు)... అని వ్యాఖ్య‌ను జోడించింది. సాయంత్రం విడుద‌లైన‌ ఫోటోలు రొమాంటిక్ డిన్నర్ సెట్టింగ్‌ను సూచిస్తాయి. అనన్య పాండే తన ముందు అరుదైన‌ వంటకాలు ఉన్నాయి. అటుపై విందార‌గించే మూడ్ లో ఉంది. అలాగే అన‌న్య‌ రాత్రి ఆకాశం క్రింద సముద్రం పక్కన పోజులిచ్చింది. అదే రోజులోని ఒక వీడియోలో గులాబీ రంగు వన్-షోల్డర్ దుస్తులను ధరించి మ్యూజిక్ ఫెస్ట్ కి హాజ‌రైంది. డ్రమ్స్‌పై మేల్ టీమ్ వాయించే ప్రత్యక్ష సంగీతాన్ని ఆస్వాధిస్తోంది. ఫుటేజ్ ఒక చలనచిత్రాన్ని చూపించే పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్, విమానం నుండి తీసిన ఇంద్రధనస్సు ఫోటో ..సముద్రతీర కొలను.. లాంజ్ కుర్చీ తో కూడుకున్న ఫోటోల‌ను షేర్ చేసారు. అయితే వీటిలో ఏ ఫోటోలోనూ ఆదిత్య రాయ్ కపూర్ కనిపించలేదు. కానీ అత‌డు అన‌న్య‌తో మాల్దీవుల్లో ఉన్నాడ‌ని కూడా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

అనన్య - ఆదిత్యలు నల్లటి దుస్తులు ధరించి రెస్టారెంట్‌లో స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనప్పటికీ అదేరోజు సాయంత్రం నుండి వచ్చిన మరొక వీడియో ఇద్ద‌రి మ‌ధ్యా క‌చ్చితంగా రిలేష‌న్ ఉంద‌ని సూచించింది. వైరల్ క్లిప్‌లో అనన్య ఆదిత్య చేతిని త‌న‌ భుజంపై ఉంచి, ఎవరితోనో మాట‌ల్లో నిమగ్నమైనప్పుడు పెద్దగా నవ్వుతూ కనిపించింది.